
● విశాఖ తీరంలో మరో ఆకర్షణ
తుది దశకు
హెలికాప్టర్ మ్యూజియం
పనులు
ఏయూక్యాంపస్:
సాగరతీరంలో మరో పర్యాటక ప్రాజెక్ట్ సిద్ధమవుతోంది. బీచ్ రోడ్డులో ఇప్పటికే ఉన్న టీయూ–142 యుద్ధ విమాన మ్యూజియం పక్కనే యూహెచ్–3 హెచ్ హెలికాప్టర్ మ్యూజియం తుది మెరుగులు దిద్దుకుంటోంది. వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో దాదాపు రూ. 2.2 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. భారత నావికాదళంలో 17 ఏళ్లపాటు అవిరళంగా సేవలందించిన ఈ హెలికాప్టర్‌ను కొద్ది నెలల కిందట విశ్రాంతినిచ్చారు. విపత్తుల సమయంలోనూ, తీర ప్రాంత భద్రతలోనూ ఇది ఎంతో కీలక పాత్ర పోషించింది. దీని ప్రాముఖ్యాన్ని గుర్తించిన వీఎంఆర్డీఏ .. భారత నావికాదళ సత్తాను చాటి చెప్పేలా, పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచేలా ఈ మ్యూజియాన్ని తీర్చిదిద్దుతోంది. ప్రస్తుతం ఈ ప్రాంగణంలో సుందరీకరణ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. రానున్న రెండు వారాల్లో దీనిని ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. హెలికాప్టర్ చుట్టూ పచ్చని లాన్‌లు, ప్రత్యేకమైన మొక్కలు, ఆకర్షణీయమైన నీటి ఫౌంటెన్‌లను ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో విద్యుత్ కాంతుల్లో మరింత అందంగా కనిపించేలా దీని చుట్టూ అద్దాల నిర్మాణం చేపట్టారు. త్వరలోనే సందర్శన వేళలు, టికెట్ ధరల వివరాలను వీఎంఆర్డీఏ ప్రకటించే అవకాశం ఉంది. నేటి యువతరం సెల్ఫీలు, ఫొటోల పట్ల చూపిస్తున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని మ్యూజియం లోపలి భాగాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.

● విశాఖ తీరంలో మరో ఆకర్షణ

● విశాఖ తీరంలో మరో ఆకర్షణ

● విశాఖ తీరంలో మరో ఆకర్షణ

● విశాఖ తీరంలో మరో ఆకర్షణ