
● సాగర్‌తీరం కిటకిట
సాగరతీరం ఆదివారం సందర్శకులతో కళకళలాడింది. వారాంతం కావడంతో నగరవాసులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో కాస్త ఇబ్బంది పడినప్పటికీ, మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆకాశం మేఘావృతం కావడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దీంతో నగర ప్రజలు బీచ్ వైపు పరుగులు తీశారు. పిల్లలు ఇసుకలో ఆటలాడుకుంటూ, పెద్దలు తీరం వెంబడి నడుస్తూ ఆనందంగా గడిపారు. కొంతమంది సముద్రంలో స్నానాలు చేశారు. యువత తమ స్నేహితులతో కలిసి సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. ఆహార స్టాళ్లు సందర్శకులతో కిటకిటలాడాయి.
– సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం