● తీరంలో గుండె‘కోత’కు అడ్డుకట్ట
విశాఖ సాగరతీరం ఏటా కోతకు గురవుతోంది. దీని కారణంగా తీరం క్రమంగా తగ్గిపోవడం, తీర ప్రాంతంలోని కట్టడాలకు ముప్పు వాటిల్లుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి, విశాఖ పోర్ట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సముద్ర గర్భం నుంచి ఇసుకను వెలికి తీసి, పైపుల ద్వారా తీరానికి తరలిస్తోంది. కోతకు గురైన ప్రాంతాల్లో పోస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన డ్రెజ్జర్‌ను డీసీఐ ఉపయోగిస్తోంది. ప్రస్తుతం కురుసుర సబ్‌మైరెన్ మ్యూజియం సమీపంలో ఈ పనులు జరుగుతున్నాయి.
– ఫొటో: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం