చీకటి | - | Sakshi
Sakshi News home page

చీకటి

Published Wed, Mar 26 2025 1:15 AM | Last Updated on Wed, Mar 26 2025 1:13 AM

చీకటి

చీకటి

బతుకులు
● విద్యుత్‌ సదుపాయం లేక చిమ్మ చీకట్లో అవస్థలు ● రేయింబవళ్లు చీకట్లో విష కీటకాలతో సావాసం ● అంగన్‌వాడీ, పాఠశాలలకు దూరాభారం ● ఎన్నికల హామీలను తుంగలో తొక్కిన కూటమి నేతలు

బర్థన్‌నగర్‌లో విద్యుత్‌ సదుపాయం లేకపోవడంతో కొవ్వొత్తుల వెలుగులో చదువుకుంటున్న విద్యార్థులు

కారు చీకట్లో కానరాని దారులు..

కొవ్వొత్తుల వెలుగులో విద్యార్థుల చదువులు..

కట్టెల పొయ్యి నుంచి వచ్చే వెలుతురులోనే

మహిళల వంటలు.. ఆరు బయట ముసురుకున్న

చీకట్లోనే కుటుంబాల భోజనాలు.. ఫ్యాన్‌ గాలి లేని

నిద్రలు.. చుట్టూ నిత్యం బుసలు కొట్టే పాములు..

ఇవీ చిమ్మ చీకట్లో నిత్యం పిల్లా పాపలతో

బర్థన్‌నగర్‌ వాసుల బతుకులు..

మొహం చాటేశారు

2023లో తొలుత 13 మందికి ఇంటి పన్ను వేశారు. మిగిలినవారికి త్వరలో వేస్తామని చెప్పారు. అయితే ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఎన్నికలప్పుడు స్థానిక టీడీపీ నాయకులు వచ్చి ఓట్లేస్తే అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాకు రూ.40 లక్షలు ఇస్తేనే చేస్తామంటున్నారు. కలెక్టర్‌, జీవీఎంసీ అధికారులు చొరవ తీసుకుని మా కష్టాలు తీర్చాలి.

–నారాయణపురం అరుణ, బర్థన్‌ నగర్‌

జీవితం దుర్భరంగా ఉంది

మేమంతా ఇళ్లల్లో పనులు, భవన ని ర్మాణ పనులు చేసుకుంటూ జీవిస్తు న్నాం. తాగునీటికి ఇబ్బందులు ఉ న్నాయంటే రెండు బోర్లు వేశారు. కా నీ విద్యుత్‌ సదుపాయం లేక తీ వ్ర ఇబ్బందులు పడుతున్నాం. రాత్రి పూట నిద్రపట్టడం లేదు. – మట్టా అనురాధ, బర్థన్‌నగర్‌

పెందుర్తి: నగరంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన జీవీఎంసీ 97 సుజాతనగర్‌కు అతి సమీపంలో వెలసిన బర్థన్‌నగర్‌ కనీస మౌలిక వసతులకు నోచుకోలేదు. ఇళ్లల్లో పనులు చేసుకుంటూ.. తాపీమేసీ్త్రలుగా.. ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న దాదాపు 120 కుటుంబాలు దాదాపు పుష్కరకాలం క్రితం ఇక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి. చిన్నపాటి గుడిసెలు, షెడ్‌లు వేసుకుని జీవిస్తున్నారు. అయితే ఈ కాలనీలో జీవీఎంసీ వేసిన రెండు తాగునీటి బోర్లు తప్ప ప్రభుత్వం నుంచి ఎలాంటి సదుపాయాలు అందలేదు. ముఖ్యంగా విద్యుత్‌ సదుపాయం లేక వీరి జీవితాలు నరకప్రాయంగా మారాయి. ఇక్కడి పిల్లలకు పాఠశాలలకు వెళ్లేందుకు కూడా తగిన సదుపాయాలు లేవు. అంగన్‌వాడీ కూడా కాలనీకి మూడు కిలోమీటర్ల దూరంగా ఉండడంతో ఐదేళ్ల లోపు పిల్లలు ఇంట్లోనే ఉండిపోయే దుస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే బర్థన్‌నగర్‌ వాసుల అవస్థలు చంతాడంతా ఉన్నాయి.

పాములు, తేళ్లతో భయం భయం

మా ప్రాంతంలో జీవీఎంసీ వేసిన రెండు బోర్లు తప్ప ఏమీ లేవు. రోడ్డు ఊసే లేదు. విద్యుత్‌ లేకపోవడంతో బాధలు పడుతున్నాం. రాత్రుళ్లు కంటి మీద కునుకే ఉండడం లేదు. పాములు, తేళ్లు మా ముందే తిరుగుతున్నాయి. భయమేస్తుంది.

– గొద్దు నారాయణమ్మ, బర్ధన్‌నగర్‌

అంగన్‌వాడీకి పంపలేని పరిస్థితి

చాలా ఏళ్లుగా ఇక్కడే చిన్న షెడ్‌ వేసుకుని ఉంటున్నాం. విద్యుత్‌ సదుపాయం లేకపోవడంతో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. దోమలు ఈగలతో చాలా కష్టపడుతున్నాం. దూరాభారం వల్ల పిల్లలను అంగన్‌వాడీలకు పంపించలేకపోతున్నాం. – షేక్‌ మహాపజా, బర్థన్‌నగర్‌

సూర్యాస్తమయంతో కష్టాలు మొదలు

బర్థన్‌నగర్‌లో దాదాపు 120 కుటుంబాలు ఉంటున్నాయి. వీళ్లలో అధిక శాతం మంది సమీపంలోని ఉన్నత వర్గాల ఇళ్లల్లో పనులు చేస్తూ పొట్ట పోసుకుంటారు. మిగిలిన వారు తాపీ మేసీ్త్రలుగా, కూలీలుగా, ఆటో కార్మికులుగా జీవనం సాగిస్తున్నారు. కాగా కాలసీ వాసులు పగటిపూట ఏదోలా నెట్టుకొచ్చినా.. సూర్యాస్తమయం తరువాత కష్టాలు మొదలవుతాయి. పనుల మీద బయటకు వెళ్లిన వారు పొద్దుపోయాక వచ్చేటప్పుడు మార్గం చిమ్మ చీకటిగా ఉంటుంది. ఇంట్లో వంటలు చేయాలంటే కట్టెల పొయ్యి వెలుగే దిక్కు. ఇక విద్యార్థుల చదువులు కొవ్వొత్తుల వెలుతురులోనే సాగుతున్నాయి. నిత్యం విష కీటకాలు భయంతో కునుకు తీయాల్సిన దుర్భర జీవితం వీరిది.

అప్పుడు ఓట్లడిగి.. ఇప్పుడు మోకాళ్లడ్డు

దాదాపు 12 ఏళ్ల క్రితం ఏర్పడిన బర్థన్‌నగర్‌ వాసులకు ఆధార్‌, ఓటరు కార్డులు ఇక్కడి చిరునామాతోనే ఉన్నాయి. గ్యాస్‌ కూడా బర్థన్‌నగర్‌ చిరునామాతోనే సరఫరా అవుతుంది. 2023లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ చొరవతో జీవీఎంసీ అధికారులు ఇక్కడ నివాసం ఉంటున్న కొందరికి ఇంటి పన్నులు కూడా వేశారు. ఈ క్రమంలో విద్యుత్‌ సదుపాయం, ఇతర వసతుల కల్పనకు జీవీఎంసీ అధికారులు పూనుకున్నారు. ఎన్నికలు సమీపించడంతో ఆ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఈ క్రమంలో 2024 ఎన్నికల సమయంలో కాలనీకి ప్రచారానికి వచ్చిన కూటమి నాయకులు తాము అధికారంలోకి వస్తే సకల సదుపాయాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. తీరా అధికారంలో వచ్చాక ఇక్కడ సదుపాయాలు కల్పించాలంటే కాలనీవాసులంతా కలిసి రూ.40 లక్షలు ఇవ్వాలని ఓ ప్రజాప్రతినిధి డిమాండ్‌ చేస్తున్నట్లు వారు ఆరోపిస్తున్నారు. నిరుపేదలమైన తమకు కనీస మౌలిక వసతుల కల్పనకు కూడా ఈ తరహాలో ప్రవర్తించడం పట్ల వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీ ఉన్నతాధికారులు చొరవ తీసుకుని తమకు విద్యుత్‌ సదుపాయంతో పాటు ఇతర వసతులు కల్పించాలని కోరుతున్నారు.

కనీస మౌలిక వసతులు లేక అల్లాడిపోతున్న బర్థన్‌నగర్‌ వాసులు

కొవ్వొత్తుల వెలుగులోనే చదువు

నేను రోజు మా కాలనీ నుంచి పెందుర్తి వెళ్లి చదువుకుంటున్నాను. పాఠ శాల నుంచి ఇంటికి వచ్చాక చదువుకుందామంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. పరీక్షల సమయంలో అయి తే నరకమే. కొవ్వొత్తుల వెలుగులో చదువుకుంటున్నాం. – ఆశ, విద్యార్థిని, బర్థన్‌నగర్‌

చీకటి1
1/8

చీకటి

చీకటి2
2/8

చీకటి

చీకటి3
3/8

చీకటి

చీకటి4
4/8

చీకటి

చీకటి5
5/8

చీకటి

చీకటి6
6/8

చీకటి

చీకటి7
7/8

చీకటి

చీకటి8
8/8

చీకటి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement