ప్రలోభాలతో ప్రయత్నాలు
● నేరుగా రంగంలోకి దిగుతున్న మంత్రి లోకేష్ ● ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేటర్లతో సమావేశం? ● వెంటాడుతున్న యాదవ సామాజికవర్గ డిమాండ్లు ● పీఠం ఆశిస్తున్న వ్యక్తులపై ఇప్పటికే అవినీతి మరకలు
వాస్తవానికి జీవీఎంసీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు 2/3 మెజార్టీ అవసరం ఉంది. అయితే కూటమి పార్టీలకు అంత మెజార్టీ లేదు. కొద్ది మందిని బెదిరించి, మరి కొద్ది మందిని ప్రలోభాలకు గురిచేసి తమ వైపునకు లాక్కొనే ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ అవిశ్వాసం నెగ్గేందుకు అవసరమైన మెజార్టీ (64 మంది కార్పొరేటర్లు) దక్కలేదు. ఈ నేపథ్యంలో మరింతగా ప్రలోభాలకు గురిచేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడటం ద్వారా నెగ్గేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ముగ్గురు నేతలకు బాధ్యతలను అప్పగించారు. వీరంతా కొద్ది మందిని నయానో భయానో తమ పార్టీల్లోకి చేర్చుకునే ప్రయత్నం చేశారు. అయినా 2/3 మెజార్టీ సభ్యులు కూటమి పార్టీల్లో చేరలేదు. అవిశ్వాసం నోటీసులో పలువురి సంతకాలను కూటమి నేతలే చేసినట్లు విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ఇక లాభం లేదనుకుని నేరుగా లోకేష్ రంగంలోకి దిగుతున్నట్టు సమాచారం.