
గంగవరం పోర్టులో రెండు లోకో ఇంజిన్లు
పెదగంట్యాడ: అదానీ గంగవరం పోర్టులో యాజమాన్యం అదనంగా రెండు లోకో ఇంజిన్‌లను మంగళవారం ప్రవేశపెట్టింది. దీంతో నౌకాశ్రయ నిర్వహణ సామర్థ్యం పెరగడంతో పాటు ర్యాక్ హ్యాండ్లింగ్ సామర్థ్యం కూడా మెరుగుపడనుంది. గంగవరం పోర్టు స్థిరంగా మెరుగైన సేవలు అందించడంతో పాటు కార్గో నిర్వహణ పరంగా కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ సందర్భంగా పోర్టు మేనేజ్‌మెంట్ ప్రతినిధులు మాట్లాడుతూ పోర్టులో కొత్తగా రెండు లోకో ఇంజిన్లు ప్రారంభించడం ద్వారా దిగుమతిదారులకు గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.