అధికారంలో ఉండగా రెండుసార్లు రాజాం వచ్చిన చంద్రబాబు
పదుల సంఖ్యలో హామీలు
ఒక్కటీ నెరవేర్చని వైనం
ఇప్పుడు ప్రజాగళం పేరుతో కొత్త హామీలకు ప్లాన్
నేడు రాజాం రాక
విశాఖపట్నం: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్ర ప్రజలనే కాకుండా ప్రత్యేకంగా రాజాం ప్రజలను నమ్మించి మోసగించారు. 2014 – 19 మధ్య కాలంలో సీఎంగా ఉన్న సమయంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పర్యటనకు ఆయన రెండు పర్యాయాలు వచ్చారు. 2017 జనవరిలో రాజాంలో జన్మభూమి – మా ఊ రు కార్యక్రమానికి వచ్చిన చంద్రబాబు రాజాం ఆర్‌టీసీ కాంప్లెక్స్ ఆవరణలో బహిరంగ సమావేశం నిర్వహించారు.
భారీగా హామీలు ఇచ్చి గాలికి వది లేశారు. అనంతరం 2019 ఫిబ్రవరిలో మళ్లీ రాజాం వచ్చిన ఆయన రాజాం పట్టణంలోకి అడుగుపెట్టకుండా, రాజాం మండలం పొగిరి వద్ద జన్మభూమి మా ఊరు సమావేశం పెట్టి అక్కడి నుంచే వెళ్లిపోయారు. 2017లో ఇచ్చిన హామీలు తీర్చకపోవడంతో ప్రజలు నిలదీస్తారనే భయంతోనే 2019లో పొగిరి గ్రామం వద్ద సమావేశం పెట్టి వెనుదెరిగార నే ఆరోపణలు ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టి ఎన్ని కల నేపథ్యంలో ఇప్పుడు కొత్త హామీలకు పక్కా ప్లా న్ వేసుకున్న చంద్రబాబు సోమవారం రాజాం ప్రజాగళం యాత్రకు వస్తున్నారు. ఈ సభలో ఎన్ని ఉత్తుత్తి హామీలు ఇస్తారోనని ప్రజలు పెదవి విరిస్తున్నారు.
ఈ హామీలు ఏమైనట్లు బాబూ..
2017 జనవరిలో రాజాం వచ్చిన చంద్రబాబు జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ప్రసంగించారు. రాజాం ఆర్‌టీసీ కాంప్లెక్స్ వద్ద బహిరంగ సభ పెట్టి న ఆయన ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంధి మల్లిఖార్జునరావు సమక్షంలో రాజాం పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని, కోట్లాది రూపాయలు నిధులు ఇస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఆదర్శ రాజాం విషయాన్ని పక్కన పెడితే కనీసం రాజాం పట్టణంలో ప్రధాన రహదారి విస్తరణ, ఆర్‌టీసీ కాంప్లెక్స్ నిర్మాణంపై కూడా దృష్టి పెట్టలేదు.
మరికొన్ని హామీలు ఇలా..
♦ రాజాం పట్టణంలో రింగు రోడ్డు నిర్మాణం. కంచరాం సమీపంగా రోడ్డు వేసి పాలకొండ రోడ్డుకు అనుసంధానం.
♦ రాజాం పట్టణం నుంచి పరిసర ప్రాంతాలకు డబల్ రోడ్డు నిర్మాణం.
♦రాజాం ఆర్‌టీసీ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన.
♦రాజాం ప్రధాన రహదారి విస్తరణకు హామీ.
♦రాజాంను ఆదర్శ నగరపంచాయతీ చేయడం
♦ కిడ్నీ రోగులకు ఉచితంగా పాస్‌లు ఇచ్చి కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్సను అందించడం. సంచార అంబులెన్స్‌లు ఏర్పాటు చేయడం, ప్రతీ గ్రామానికి రెగ్యులర్‌గా వైద్యులను పంపించడం, ప్రపంచంలోని మేథావులను తీసుకొచ్చి ఉద్దానం కిడ్నీ సమస్యలను అరికట్టడం
♦ప్రతీ గ్రామానికి మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి, తాగునీటిని అందించడం
♦అన్ని గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మాణం
♦వంశధార–నాగావళి అను సంధానం పూర్తి చేయడం, నారాయణపురం ఆనకట్ట ఆయకట్టులో పూర్తిగా సాగునీటి అందించడం
♦మడ్డువలస రెండో విడత పనులు పూర్తి చేస్తానని బడాయి బాబు హామీలు ఇచ్చారు. వీటిలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు.
2019లో పొగిరి నుంచే వెనుదెరిగిన బాబు..
2017 జనవరిలో రాజాం వచ్చి ఇచ్చిన హామీలు నెరవేర్చని చంద్రబాబును ప్రజలు ప్రశ్నిస్తారని తెలి సి 2019లో జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి చంద్రబాబు రాజాం రాలేదు. రెండు రోజులు ముందు వరకూ రాజాం ఆర్‌టీసీ కాంప్లెక్స్‌కు టూర్ షెడ్యూల్ ఇచ్చి అనంతరం పొగిరి జెడ్‌పీ హైస్కూల్ ఆవరణకి సభ మార్చారు. అక్కడ కూడా రాష్ట్ర బడ్జెట్, ప్రకృతి వ్యవసాయంపై మాత్రమే చంద్రబా బు ప్రసంగం నడిచింది. 15 నిమిషాలు మాట్లాడి, అక్కడి నుంచి చంద్రబాబు అటు శ్రీకాకుళం వైపు వెళ్లిపోయారు
ఇప్పుడేమిస్తారో....
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు రాజాం ఈ నెల 15న వస్తున్నారు. ఎన్నికల వేళ ఎన్నెన్ని హామీలు ఇస్తారో వేచి చూడాలని రాజాం ప్రజలు గుసగుసలాడుతున్నారు. గతంలో ఏ ఒక్క హామీని నెరవేర్చని బాబు అనంతరం రాజాం గురించి ఏ ఎన్నికల్లో కూడా ప్రస్తావన తేలేదు. ఇప్పుడు ప్రత్యేకంగా రాజాం వచ్చి రాజాంను అది చేస్తాం...ఇది చేస్తామని చెప్పినా పట్టించుకునే పరిస్థి తి ఇక్కడ కనిపించడంలేదు. చంద్రబాబు మాయ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.
Comments
Please login to add a commentAdd a comment