● స్వల్ప ఘటనలు
సిరిమాను సంబరానికి ముందు తల్లి సేవకురాలిపై పిట్టగోడ కూలింది. దీంతో స్వల్ప గాయాలపాలైన ఆమెను ఫీడర్ అంబులెన్స్‌లో తరలించి చికిత్స అందించారు. మాజీ ట్రస్టు బోర్డు చైర్మన్ పూడి దాలినాయుడుకు భక్తులు విసిరిన కొబ్బరి చిప్ప తగలడంతో స్వల్ప గాయమైంది.
● సిరిమానోత్సవం సమయంలో పారిశుద్ధ్య చర్యలు అంతంత మాత్రం గానే కానవచ్చాయి. రథం తిరుగుతున్న సమయంలో భక్తులు అరటిపండ్లు విసరడం ఆనవాయితీ. గతంలో వెనువెంటనే వీటిని శుభ్రపరిచేవారు. ఈసారి సకాలంలో స్పందించకపోవడంతో, అరటి పండ్ల మీద కాలు వేసి, చాలామంది భక్తులు జారిపడ్డారు.
● జాతరలో పెద్ద ఎత్తున తాత్కాలిక దుకాణాలు వెలిశాయి. ఈ క్రమంలో తమ నుంచి కొంతమంది ఆశీల రూపంలో దౌర్జన్యంగా నగదు వసూలు చేశారని పలువురు వ్యాపారులు వాపోయారు.
● ముగిసిన ఉత్సవం: సిరిమాను ఉత్సవం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమైంది. తిరిగి సాయంత్రం 5.10 నిమిషాల సమయంలో గద్దె వద్దకు ఘటాలు చేరుకోవడంతో సంబరం ముగిసినట్లయింది.
● స్వల్పమైనవి మినహా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment