గంజాయి రహిత రాష్ట్రమే లక్ష్యం
విజయనగరం క్రైమ్: గంజాయి రహిత రాష్ట్రమే లక్ష్యమని, గంజాయి క్రయవిక్రయదారులు, రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర డీజీపీ, ఆర్టీసీ ఎమ్‌డీ సీహెచ్ ద్వారక తిరుమలరావు తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చిన ఆయనకు ఎస్పీ వకుల్ జిందల్, కమాండెంట్ మాలిక గార్గ్, పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి పూలమొక్కలు అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో డీజీపీ సమావేశమయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు జిల్లా పోలీస్‌శాఖ చేపట్టిన చర్యలపై సమీక్షించారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు ఎస్పీ వకుల్ జిందల్ చేపట్టిన సంకల్పం కార్యక్రమం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఇదే స్ఫూర్తితో పనిచేసి, జిల్లా పోలీస్ శాఖకు, రాష్ట్రానికి మరింత మంచి పేరు తీసుకురావాలన్నారు. నేరాల నియంత్రణలో సాంకేతికతను వినియోగించి, నేరాల కట్టడికి చర్యలు చేపడుతున్నామని, అవి నేడు సత్ఫలితాలనిస్తున్నాయన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, వివిధ నేరాలను ఛేదించడంలో పోలీసుల కృషిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డీజీపీకి ఎస్పీ వకుల్‌జిందల్ వివరించారు. అనంతరం డీజీపీని దుశ్శాలువతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. సమావేశంలో విశాఖరేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పోలీస్ సిబ్బందికి డీజీపీ అభినందనలు
జిల్లా పోలీసులు జమ్ము కశ్మీర్ వెళ్లి డిజిటల్ అరెస్టు కేసులో నిందితులను అరెస్టు చేసి, కేసును ఛేదించడం, రూ.20 లక్షల నగదును రికవరీ చేయడం, మరింత నగదును నిందితుడి బ్యాంకు ఖాతాలో ప్రీజ్ చేయడాన్ని డీజీపీ అభినందించారు. సీఐలకు త్వరలో డీఎస్పీలుగా ఉద్యోగోన్నతులు కల్పిస్తామ ని తెలిపారు. గంజాయి నియంత్రణకు ఈగల్ అనే విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటుచేశామని, కింగ్ పిన్స్, గ్యాంగ్‌స్టర్స్‌ను అరెస్టు చేసి గంజా అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపామన్నారు. సమావేశంలో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి పాల్గొన్నారు.
‘సంకల్పం’ స్ఫూర్తిదాయకం
అధికారులకు దిశానిర్దేశం చేసిన రాష్ట్ర డీజీపీ సీహెచ్ ద్వారక తిరుమలరావు
Comments
Please login to add a commentAdd a comment