చీపురుపల్లి రూరల్ (గరివిడి): కళాశాలకు వీసీఐ (వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) గుర్తింపు లేకపోతే వెటర్నరీ విద్యను అభ్యసిస్తున్న తమ భవిష్యత్తు అంధకారం అవుతుందని శ్రీ వెంకటేశ్వర పశువైద్య కళాశాల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలకు వీసీఐ గుర్తింపు తేవాలంటూ కళాశాల ప్రాంగణంలో మంగళవారం ఆందోళన చేశారు. కళాశాలలో 327 మంది విద్యార్థులు చదువుతున్నారని, ఫస్ట్ బ్యాచ్‌కు చెందిన 69 మంది విద్యార్థులు ఈ ఏడాది ఏప్రిల్‌లో రిలీవ్ కానున్నారన్నారు. వీరికి ఇంటర్న్‌షిప్‌లో ఎన్రోల్ కావడానికి, పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) ఎంట్రన్స్ ఎగ్జామ్‌కు, ఉద్యోగాల సాధనకు ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ఇప్పటికై నా కళాశాలకు కావాల్సిన సదుపాయాలు కల్పించి వీసీఐ గుర్తింపు తీసుకురావాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
వెటర్నరీ కళాశాల ప్రాంగణంలో విద్యార్థుల ధర్నా
Comments
Please login to add a commentAdd a comment