‘బడిదేవర’ తవ్వకాల అనుమతులపై ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

‘బడిదేవర’ తవ్వకాల అనుమతులపై ఆగ్రహం

Published Fri, Jan 31 2025 1:26 AM | Last Updated on Fri, Jan 31 2025 1:26 AM

‘బడిదేవర’ తవ్వకాల అనుమతులపై ఆగ్రహం

‘బడిదేవర’ తవ్వకాల అనుమతులపై ఆగ్రహం

పార్వతీపురం టౌన్‌: బడిదేవర కొండ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని కొండ పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు మూడడ్ల కృష్ణమూర్తి డిమాండ్‌ చేసారు. పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయం అడవితల్లి విగ్రహం వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడి దేవరమ్మ కొండ మైనింగ్‌ తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అన్ని రకాల అనుమతులు రద్దు చేయాలని, కొండ పరిసర ప్రాంత గిరిజనులకు న్యాయం చేయాలన్నారు. కొండపై గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చిన చోట మైనింగ్‌ తవ్వకాలకు ఎలా అనుమతి ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేసారు. కొండపై మైనింగ్‌కు ఇచ్చిన అన్ని రకాల అనుమతులు రద్దు చేయాలని డిమాండ్‌ చేసారు. ఐటీడీఏ అధికారులు గిరిజనులకు రక్షణగా ఉండాలని కోరారు. తవ్వకాలకు కనీసం అభిప్రాయ సేకరణ కూడా చేపట్టలేదన్నారు. అక్కడి గిరిజనులు, రైతులు బడి దేవరమ్మ కొండను దేవతగా కొలుస్తారని పేర్కొన్నారు. అడ్డగోలుగా తవ్వకాలకు అనుమతులిచ్చి వ్యవసాయం, పర్యావరణం, గిరిజన బ్రతుకులు నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అనంతరం ఏపీఓ మురళీధర్‌, ఏఓ ప్రసాద్‌లకు వినతిపత్రం అందజేశారు. కొండ పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు అఖిల భారత రైతు కూలీ సంఘం నేత బొత్స నర్సింగరావు, రైతు కూలీ సంఘం నాయకులు పి. శ్రీను నాయుడు, ఉయక ముత్యాలు, ఎం.భాస్కరావు గిరిజన సంక్షేమ సంఘం నాయకులు పాలక రంజిత్‌కుమార్‌, అఖిల భారత గ్రామీణ వ్యవసాయ కార్మిక సంఘం పి.సంఘం, ఏపీ రైతు సంఘం నాయకులు బుడితి అప్పలనాయుడు, సీపీఐ నాయకులు తోట జీవన్‌, ప్రగతి శీల మహిళా సంఘం నాయకులు పోలా రమణి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గరుగుబిల్లి సూరయ్య, పాల మెట్ట రాము, అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు నారాయణపురం రాజు పాల్గొన్నారు.

అనుమతులు రద్దు చేయకుంటే

ఆందోళన ఉధృతం

ఐటీడీఏ కార్యాలయం వద్ద ధర్నా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement