ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల పాత్ర కీలకం
● కేజీబీవీ సెక్రటరీ డి.దేవానందరెడ్డి
● ఉత్తమ ఫలితాల కోసం పంచతంత్ర ప్రణాళికపై సమీక్ష
విజయనగరం అర్బన్: కేజీబీవీల్లో బాలికలకు విద్యాబోధనలు అందించడంతో పాటు వాళ్ల మానసిక వికాసాన్ని పెంపొందించడానికి ప్రిన్సిపాళ్లు, బోధన సిబ్బంది తల్లిదండ్రుల తమ వంతు పాత్ర బాధ్యతగా నిర్వహించాలని కేజీబీవీ స్టేట్ సెక్రటరీ డి.దేవానందరెడ్డి అన్నారు. కేజీబీవీ నిర్వహణపై ప్రిన్సిపాళ్లతో స్థానిక కేజీబీవీలో గురువారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పది, ఇంటర్ వార్షిక పరీక్షల ఉత్తమ ఫలితాల కోసం చేపట్టిన పంచతంత్ర ప్రణాళిక పనితీరును తొలిత కేజీబీవీల వారీగా ప్రిన్సిపాళ్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెసిడెన్షియల్‌గా నిర్వహిస్తున్నందున బాలికల అన్ని విధాల అభివృద్ధి బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఆరో తరగతి నుంచి బేసిక్స్ బోధనలు అందించడంలో శ్రద్ద తీసుకుంటే పది, ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధ్యం సులువవుతాయని అన్నారు. కేజీబీవీల పరిసరాల పరిశుభ్రంతో పాటు ఆహార పదార్ధాల నాణ్యత పాటించాలని ఆదేశించారు. సమావేశంలో డీఈఓ యూ.మాణిక్యంనాయుడు, సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ ఎ.రామారావు, జీసీడీఓ పి.మాలతి, అసిస్టెంట్ జీసీడీఓ కె.గాయత్రి, జిల్లాలోని 26 కేజీబీవీల ప్రిన్సిపాళ్లుపాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment