ఏనుగుల కదిలికలపై మా సిబ్బంది నిరంతరం దృష్టి సారిస్తున్నారు. అవి సంచరించే పరిసరాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. ఏనుగుల పునరావాస కేంద్రం ఏర్పాటుకు గుచ్చిమి వద్ద ఏర్పాట్లు చేపట్టనున్నాం. ఇందుకు సంబంధించి శాఖాపరమైన అనుమతులు వచ్చాయి. రూ.5 కోట్లతో సోలార్ కంచె, ట్రెంచులు, వెదురు వనాలు, నీటి సంపులు, ఇతర వసతులు ఏనుగుల కోసం సిద్ధం చేయాలని నిర్ణయించాం. తొలి దశలో రూ.కోటి నిధులుతో పనులు చేపడతాం. పంట నష్టాలకు సంబంధించి దాదాపు మూడు వేల మంది రైతులకు రూ.45లక్షలు వరకు జమ చేశాం. రెండు మూడు రోజుల్లో సదరు రైతుల ఖాతాకు ఈ మొత్తాలు పూర్తిగా జమ కాబడతాయి. కుంకీ ఏనుగులను తీసుకువచ్చే విధంగా అడుగులు పడుతున్నాయి. – జీపీఏ ప్రసూన, అటివీ శాఖాధికారిణి
Comments
Please login to add a commentAdd a comment