![మన్యంలో.. గజ ఘీంకారం..!](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/31/30plkd01-280035_mr-1738266370-0.jpg.webp?itok=Wzqn-3XB)
మన్యంలో.. గజ ఘీంకారం..!
తోటల్లో సంచరిస్తున్న ఏనుగుల గుంపు
గ్రామాల్లో కునుకు కరువు
జిల్లాలో సువిశాలంగా విస్తరించి ఉన్న ఏజెన్సీ, నాగావళి, వంశధార, జంఝావతి నదీతీర పరివాహక ప్రాంతాల వెంబడి గజరాజుల గుంపులు తిష్ట వేసాయి. పాలకొండ నియోజకవర్గంలో భామిని, సీతంపేట పరిసరాల్లో నాలుగు ఏనుగులు సంచరిస్తూ పంటలు ధ్వంసం చేస్తున్నాయి. పార్వతీపురం రెవెన్యూ సబ్ డివిజన్ పరిధిలో కురుపాం, కొమరాడ, గరుగుబిల్లి, జియ్యమ్మవలస మండలాల్లో నిత్యం సంచరిస్తున్న ఏడు ఏనుగుల గుంపు అక్కడి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రైతులు సేద్యం చేస్తున్న అరటి, బొప్పాయి, మొక్కజొన్న, చెరకు, వరి, పామాయిల్, కర్బూజ, మామిడి, జీడి పంటలతో పాటు ఇతర ఆహార, వాణిజ్య పంటలను నాశనం చేస్తున్నాయి. జిల్లా పరిధిలో సుమారు 3,500 ఎకరాల మేర పంటలు ఏనుగుల సంచారంతో తీవ్రంగా దెబ్బతింటున్నాయి. రూ.కోట్లలో నష్టం సంభవిస్తున్నా... ఇందుకు సంబంధించిన పరిహారం నేటికీ అందించలేదు.
మరణ మృదంగం
గజరాజుల సంచారంతో గడిచిన కొద్ది సంవత్సరాల్లో 13 మంది మృత్యువాత పడ్డారు. 12 పశువులు మృతి చెందినట్టు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. వీటితో పాటు వ్యవసాయ బోర్లు, పంపు షెడ్లు, పరికరాలను, డ్రిప్ పైపులను నాశనం చేసాయి.
Comments
Please login to add a commentAdd a comment