జగన్‌ను కలిసిన మాజీ ఎంపీ బెల్లాన
చీపురుపల్లి: మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిను తాడేపల్లిలోని ఆయన నివాసంలో విజయనగరం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ గురువారం కలిశారు. జిల్లాలోని పరిస్థితులపై చర్చించారు. జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన వారిలో వైఎస్సార్ సీపీ చీపురుపల్లి మండలాధ్యక్షుడు ఇప్పిలి అనంతం, రామలింగాపురం ఉప సర్పంచ్ ఇప్పిలి రాము, కోరుకొండ దాలయ్య, దత్తిరాజేరు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు గార తౌడు ఉన్నారు.
కమనీయం..
ఉమాసదాశివుని కల్యాణం
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థాన క్షేత్రపాలకుడిగా విరాజిల్లుతున్న ఉమాసదాశివుడి కల్యా ణం గురువారం రాత్రి వైభవంగా జరిగింది. ముందుగా ఆలయాన్ని పవిత్ర జలంతో శుద్ధిచేసి వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. వేకువజామున నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. శివుడికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి వివిధ రకాల ఫలరసాలతో ప్రత్యేక అభిషేకాలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు మల్లిఖార్జునశర్మ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం వరకు ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం శివ, పార్వతులను పట్టువ స్త్రాలు, వివిధ రకాల స్వర్ణాభరణాలతో సుందరంగా అలంకరించి రామతీర్థం పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం దేవాలయంలోకి తీసుకువచ్చి వేద మంత్రోచ్ఛరణ, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా జరిపించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
జగన్‌ను కలిసిన మాజీ ఎంపీ బెల్లాన
Comments
Please login to add a commentAdd a comment