![వ్యాధి నిరోధక టీకాలు శతశాతం వేయాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06vzg18-370049_mr-1738869125-0.jpg.webp?itok=uEmTyeGm)
వ్యాధి నిరోధక టీకాలు శతశాతం వేయాలి
విజయనగరం ఫోర్ట్: వ్యాధి నిరోధక టీకాలు శతశాతం వేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ జీవన రాణి తెలిపారు. ఈ మేరకు స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గురువారం ఆమె పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీ వైద్యాధికారులు, హెల్త్ సూపర్‌వైజర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ప్రధానమంత్రి మాతృ వందన యోజన కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల గర్భిణులకు స్కానింగ్ పరీక్షలు చేయాలని సూచించారు. అన్ని పీహెచ్‌సీల్లో ప్రసవాలు జరిగేలా చూడాలని చెప్పారు. బీపీ, సుగర్ రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేయాలని కోరారు. క్షయ, కుష్ఠు వ్యాధులపై సర్వే సమగ్రంగా చేపట్టాలని సూచించారు. ఫైలేరియా వ్యాధిగ్రస్తులు మందులు సకాలంలో వాడేలా చూడాలని చెప్పారు. మాతృ, శిశు మరణాలు జరగకుండా గర్భిణులను సకాలంలో ఆస్పత్రికి చేర్చాలని కోరారు. కార్యక్రమంలో డీఎల్‌ఓ డాక్టర్ కె.రాణి, డీఐఓ డాక్టర్ ఆర్. అచ్యుతకుమారి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ సూర్యనారాయణ, ఎన్‌సీడీపీఓ డాక్టర్ బీవీవీ సుబ్రహ్మణ్యం, డీఎంఓ వై.మణి, ఎస్‌ఓ ధర్మారావు, డీపీహెచ్‌ఎన్ మామిడి సత్యవతి, డెమో వి.చిన్నతల్లి పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ డాక్టర్ జీవనరాణి
Comments
Please login to add a commentAdd a comment