–8లో
భుజంగరావు బంగారం
ఆయన ఓ దివ్యాంగుడు. అయితేనేం... ఆత్మస్థైర్యంతో డ్యాన్స్ పోటీల్లో రాణిస్తున్నాడు. ప్రశంసలు అందుకుంటున్నాడు.
● పైడితల్లి ఆలయ అభివృద్ధి పనులపై
నీలినీడలు
● అమ్మవారి జాతర పూర్తికాగానే
సెలవుపై వెళ్లిపోయిన ఈఓ
● అశోక్ గజపతిరాజుపై కేసు పెట్టించారనే నెపంతోనే ఈఓపై కక్షసాధింపు!
● ఏడాదికి రూ.4 కోట్లకి పైగా ఆదాయం వస్తున్నా కానరాని అభివృద్ధి
అడుగడుగునా
ఆటంకాలే..
విజయనగరం టౌన్:
ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం.. విజయనగర ప్రజల ఇలవేల్పు.. పైడితల్లి అమ్మవారు. భక్తుల కొంగుబంగారంగా పిలిచే అమ్మవారి ఆలయ అభివృద్ధిపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం కినుకవహిస్తోంది. అధికారులపై కక్షసాధింపు ధోరణితో అభివృద్ధి పనులను పక్కనపెడుతోంది. ఆలయ విశిష్టతను మసకబార్చే ప్రయత్నాలపై భక్తలోకం మండిపడుతోంది.
2018లో ప్రారంభించిన పనులు 2023 నాటికి 60 శాతం పూర్తయినా మిగులు పనుల పూర్తికి కనీసం చర్యలు తీసుకోకపోవడం భక్తులను ఆవేదనకు గురిచేస్తోంది. ఏడాదికి రూ.4 కోట్లకు పైగా ఆదాయం వస్తున్న పైడితల్లి అమ్మవారి ఆలయం విస్తరణ పనులు ఎక్కడవేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
పైడితల్లి ఆలయ ఈఓలుగా పనిచేసిన భానురాజా, జీవీఎస్‌ఎస్ సుబ్రహ్మణ్యం, ఎస్‌డీవీవీ ప్రసాద్, సుధారాణి పర్యవేక్షణలో అభివృద్ధి పనులు శరవేగంగా జరిగాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయ అధికారులపై వేధింపులు ప్రారంభమయ్యాయి. పోలీస్, రెవెన్యూ, దేవదాయశాఖ.. ఇలా ప్రతిచోటా గత ప్రభుత్వ ఆదేశాల మేరకు పనిచేసిన ఉద్యోగులపై వేటు వేస్తూ వచ్చారు. 2021 డిసెంబర్ నెలలో రామతీర్థం రామాలయ పునర్మిర్మాణ శంకుస్థాపనను అడ్డుకుని ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై అప్పట్లో రామతీర్థం ఈఓగా పనిచేసిన డీవీవీ ప్రసాదరావు ఫిర్యాదు చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పైడితల్లి ఆలయ ఈవోగా పనిచేస్తున్న ప్రసాదరావుపై వేధింపులు ఆరంభించారు. గతేడాది అక్టోబర్‌లో పైడితల్లి అమ్మవారి జాతర పూర్తికాగానే నవంబర్ నెలలోనే ఆయన సెలవు పెట్టేసి వెళ్లిపోయారు. ఫలితం.. ఆలయానికి ఇరువైపులా ఉన్న షాపుల తొలగింపు ప్రక్రియ నిలిచిపోయింది. పెండింగ్‌లో ఉన్న రెండు భవనాల పరిస్థితి కూడా అలాగే ఉండిపోయింది. ఆలయానికి ఇరువైపులా ఉన్న రక్షణ గోడలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. తాత్కాలిక పనులకు కూడా నోచుకోలేని దుస్థితి దాపురించింది. విశాఖ కనకమహాలక్ష్మి ఆలయ రూపంలో తీర్చిదిద్దాలనే సంకల్పం మసకబారింది.
అన్నింటా జాప్యమే..
నిర్మించాల్సినవి ఇవే..
అప్పట్లో పనుల్లో జోరు..
పైడితల్లి అమ్మవారి ఆలయం విస్తరణ చేపట్టనున్న నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో అన్నప్రసాదశాల, క్యూ కాంప్లెక్స్, కుంకుమ పూజా మండపం, కేశ ఖండనశాల, కార్యాలయం నిర్మించాల్సి ఉంది. ఆలయంలో ప్రత్యేక పూజలు, అష్టోత్తర, సామూహిక కుంకుమార్చనలు చేసేందుకు ప్రస్తుతం స్థలం సరిపడడంలేదు. స్థలం ఉన్నా వాటిని అభివృద్ధి చేసే నాథుడు లేకపోవడంతో ఆలయానికి రావాల్సిన ఆదాయానికి గండిపడుతోంది. ప్రస్తుతం రెండు క్యూలు ద్వారా మాత్రమే భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. క్యూ కాంప్లెక్స్‌ను సైతం నిర్మించాల్సి ఉంది. ఆలయానికి ఇరువైపులా ఉన్న రామకృష్ణ వస్త్రాలయం, సెల్‌షాప్, ఆయుర్వేదం షాపు, బరంపురం సిల్క్స్, స్టూడెంట్ ఎంపోరియంలు ఇప్పటికే అమ్మవారికి స్థలాన్ని అప్పగించేసి, ఎదురుగా పైడితల్లి దేవస్ధానం ఇచ్చిన స్థలంలో కట్టుకుని ఆలయ అభివృద్ధికి సహకరించారు. ఇంకా పారడైజ్ హోటల్, సిటీ స్కాన్స్ చిన్నపాటి లిటిగేషన్‌లో ఉండిపోయినట్లు అధికారులు చెబుతున్నారు.
పైడితల్లి అమ్మవారి చదురుగుడి ఆలయం ప్రస్తుతం 1316 చదరపు గజాల్లో ఉంది. ఆలయానికి పక్కన ఉన్న షాపులను తొలగించిన తర్వాత 3055.52 చదరపు గజాల స్థలం అదనంగా వస్తుంది. 4,371 చదరపు గజాల్లో అమ్మవారి ఆలయం సువిశాలంగా నిర్మించే అవకాశం ఉంది. దాతల సహకారంతో ఆలయానికి ఎదురుగా ఉన్న ఎడ్వర్డు ఆస్పత్రి స్థలాన్ని రూ.1,19,4,975లకు కొనుగోలు చేశారు. ఆలయానికి ఇరువైపులా ఉన్న షాపుల యజమానులకు ఆ స్థలాన్ని ఇవ్వడమే కాకుండా స్ట్రక్చర్ వేల్యూ కింద ఇప్పటికే రూ.1,57,04,085లు అందజేశారు. మరో రెండు షాపులకు సంబంధించి ఇంకా సుమారు రెండున్నరకోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. చిన్నచిన్న వివాదాలతో అది కొలిక్కిరాలేదు.
అధికారులు, పాలకుల దృష్టికి తీసుకెళ్లా...
పైడితల్లి అమ్మవారి ఆలయ విస్తరణ పనుల అంశం ఇప్పటికే ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాను. గతేడాది నవంబర్ నెల చివరిలో ఇన్‌చార్జి బాధ్యతలు చేపట్టాను. ప్రస్తుతం ఉన్న ఆలయం గోడలు తొలగించి వాస్తురీత్యా నిర్మాణానికి వేదపండితులు, స్తపతి వచ్చి పరిశీలించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు, ఎమ్మెల్యేల ఆదేశాలతో తాత్కాలిక అభివృద్ధికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఆలయానికి పక్కన ఉన్న పారాడైజ్, సిటీ స్కాన్స్ విషయమై చర్చిస్తున్నాం. అవి కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
– కేఎన్‌వీడీవీ ప్రసాద్, డిప్యూటీ కమిషనర్, ఈఓ మాన్సాస్, ఇన్‌చార్జి ఈఓ పైడితల్లి దేవస్థానం
–8లో
–8లో
–8లో
Comments
Please login to add a commentAdd a comment