![భర్త](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06gjn61a-370037_mr-1738869122-0.jpg.webp?itok=8i7thRN3)
భర్త చేతిలో భార్య హతం
దత్తిరాజేరు: మండలంలోని గుచ్చిమి గ్రామ సమీపంలో గల ఆయిల్ పాం తోటలో చుక్కపేట గ్రామానికి గ్రామానికి చెందిన యాకల గౌరమ్మపై(44) ఆమె భర్త సత్యం కొడవలితో దాడి చేసి హత్యకు పాల్పడ్డాడు. గురువారం జరిగిన ఈ సంఘటనపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుచ్చిమి గ్రామంలోని పొలాల్లో వరి కంకులు కోయడానికి గౌరమ్మ చుక్కపేట నుంచి ఉదయం బయల్దేరి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన భర్త కొడవలితో ఆమె ఒంటిపైన చెవులు, తలపైన దాడి చేయడంతో పొలాలకు వెళ్లే చిన్నపాటి దారిలో కుప్పకూలిపోయింది. కిందపడిన ఆమె ఒంటిపై కొడవలితో తీవ్రగాయాలు చేశాడు. ఈ విషయాన్ని సమీపంలో పనులు చేస్తున్న స్థానికులు గమనించి మృతురాలి కుటుంబసభ్యులు, 108వాహనానికి సమాచారం అందించారు. సమాచారం మేరకు వచ్చిన 108 సిబ్బంది గౌరమ్మను పరిశీలించి అక్కడికక్కడే మృతిచెందినట్లు నిర్ధారించారు. తల్లి గాయాల పాలైందని తెలుసుకుని వచ్చిన కుమారుడు గణేష్, కుమార్తె భవానిలు మృతిచెందిన తల్లిని చూసి కన్నీరుమున్నీరయ్చారు. ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పెదమానాపురం ఎస్సై జయంతి సిబ్బంది చుట్టు పక్కల పరిశీలించి కొద్ది దూరంలో పడి ఉన్న కొడవలిని గమనించారు. సంఘటనా స్థలానికి గజపతినగరం సీఐ జీఏవీ రమణ వచ్చి క్లూస్ టీమ్‌ను రప్పించి నిందితుడు ఎటు వైపు నుంచి తప్పించుకుని పారిపోయాడో పరిశీలించారు. కుమారుడు గణేష్ సీఐఎస్‌ఎఫ్ ఉద్యోగం చేస్తూ సెలవుపై వచ్చి ఇంటి వద్ద ఉన్నాడు, కుమర్తె కూడా ఇంట్లోనే ఉంటోంది. తల్లిదండ్రులు పొలంపనికి వెళ్తుండగా గొడవ పడి తల్లి మృతి చెందడంతో పిల్లలిద్దరూ గుందెలవిసేలా రోదిస్తున్నారు.
![భర్త చేతిలో భార్య హతం1](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06gjn61-370037_mr-1738869122-1.jpg)
భర్త చేతిలో భార్య హతం
Comments
Please login to add a commentAdd a comment