నియోజకవర్గాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు
విజయనగరం అర్బన్: నియోజకవర్గాల వారీగా అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశించారు. రాష్ట్రంలోని సహజ పనరులను పూర్తి స్థా యిలో వినియోగించుకుంటూ రాష్ట్ర స్థితిగతులను మార్చేలా స్వర్ణాంధ్ర–2047 విజన్స్ ప్లాన్ కోసం సిద్ధం చేసిన పది సూత్రాల ప్రణాళికను అధికారులంతా చిత్తశుద్ధితో అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల కలెక్టర్లతో గురువారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పేదరిక నిర్మూలన, అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, గ్యాస్ ప్లాంట్లు, ఎంఎస్‌ఎంఈ సర్వే తదితర అంశాలపై సమీక్షించారు. సున్నా పేదరికం కోసం పీ–4 విధానంలో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సీఎస్ ఆదేశించారు. దీని కోసం అందుబాటులో ఉన్న వనరులను గుర్తించాలన్నారు. గ్రామ, మండల స్థాయిలలో సమగ్రంగా అధ్యయనం చేసి వీటిని రూపొందించాలని సూచించారు. ప్రతి నియోజకవర్గానికి ఒక జిల్లా స్థాయి అధికారిని నోడల్ అధికారిగా నియమించామన్నారు. వీరికి సహాయంగా ఐదుగురు సిబ్బందిని సమకూరుస్తామని చెప్పారు. ఎంఎస్‌ఎంఈ సర్వేను మార్చి 15 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్రస్థాయిలో పలువురు ఉన్నతాధికారులతోపాటు, జిల్లా నుంచి కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, సీపీఓ పి.బాలాజీ, జెడ్పీ సీఈఓ బి.వి.సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య, డీపీఓ టి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
కొత్త బాధ్యతలు
విజయనగరం అర్బన్: వైఎస్సార్‌సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్ల విభాగం జిల్లా అధ్యక్షునిగా విజయనగరం పట్టణానికి చెందిన డోల మన్మథకుమార్‌ను పార్టీ కేంద్ర కార్యాలయం నియమించింది. ఈ మేరకు పార్టీ జాతీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నియామక ఉత్తర్వులు విడుదల చేశారు. ఇప్పటివరకు ఆయన శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల జోన్–1 గ్రీవెన్ సెల్ జోనల్ ఇన్‌చార్జిగా పార్టీకి పనిచేశారు. మేధావులవర్గం నాయకుడిగా గుర్తింపు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment