బాలోత్సవ్ విజేతలుగా బాలికోన్నత స్కూల్ విద్యార్థినులు
విజయనగరం అర్బన్: పట్టణంలో మంగళ, బుధవారాల్లో జరిగిన జిల్లా స్థాయి బాలోత్సవ్–8 సాంస్కృతిక అంశాల పోటీల్లో దాసన్నపేట ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు పలువురు విజేతులుగా నిలిచారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.రమణమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. స్పెల్ బీ సీనియర్స్ విభాగంలో డి.సాయిలలితశ్రీకి, డ్రాయింగ్ సీనియర్స్ విభాగంలో జి.గీతాంజలికి, కథారచన సీనియర్స్ విభాగంలో ఆసియా అహ్మద్‌కు, డ్రాయింగ్ జూనియర్స్ విభాగంలో జె.శశిరేఖకు ప్రథమ బహుమతులు లభించాయి. కథారచన సీనియర్స్ విభా గంలో పి.ఝాన్సీకి, పాటల సీనియర్స్ విభా గంలో అన్నపూర్ణేశ్వరికి, వక్తృత్వం సీనియర్స్ విభాగంలో ఆసియా అహ్మద్‌కు తృతీయ బహుమతి లభించిందని పేర్కొన్నారు. గురువారం పాఠశాల ప్రాంగణంలో విజేతలను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.
గురజాడ స్కూల్ విద్యార్థులకు బహుమతులు
బాలోత్సవ్ సాంస్కృతిక పోటీలలో పట్టణానికి చెందిన గురజాడ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు పలువురు విజేతలుగా నిలిచారని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పూడి శేఖర్ తెలిపారు. లఘునాటిక జూనియర్స్ విభాగంలో ప్రథమం, జానపదం జూనియర్స్ విభాగంలో ద్వితీయం, వ్యాసరచన జూనియర్స్ విభాగంలో ద్వితీయం, వ్యక్తృత్వ జూనియర్ విభాగంలో తృతీయ బహుమతులకు 42 మంది విద్యార్థుల బృందం సాధించినట్లు తెలిపారు. విజేతలను పాఠశాల డైరెక్టర్ డాక్టర్ ఎంవీఆర్‌కృష్ణాజీ, కరస్పాండెంట్ ఎం.స్వరూప, ఉపాధ్యాయులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment