ట్రాక్టర్‌ను ఢీ కొట్టి ద్విచక్ర వాహన చోదకుడి మృతి
చీపురుపల్లి: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మండలంలోని విజయరాంపురం గ్రామానికి చెందిన దన్నాన శ్రీనివాసరావు(35) ముందుగా వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీ కొట్టి మృతిచెందాడు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎస్సై ఎల్.దామోదరరావు తెలిపిన వివరాల్లోకి వెళ్తే..బుధవారం రాత్రి 10 గంటల సమయంలో పట్టణంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద చీపురుపల్లి నుంచి గరివిడి వైపు వెళ్తున్న ట్రాక్టర్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న శ్రీనివాసరావు బలంగా ఢీ కొట్టాడు. దీంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. విజయరాంపురం గ్రామానికి చెందిన శ్రీనివాసరావు విశాఖపట్టణంలో తాపీమేసీ్త్రగా పనిచేస్తున్నాడు. ప్రతిరోజూ చీపురుపల్లి నుంచి రైలులో ప్రయాణించి విశాఖలో పని ముగించుకుని తిరిగి వస్తుంటాడు. అయితే తన భార్య, పిల్లలు గజ్జింగివలసలోని అత్తవారింట్లో ఉండడంతో వారి వద్దకు బుధవారం రాత్రి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఘాట్‌రోడ్డులో మరో వ్యక్తి..
పాచిపెంట: మండలంలోని పి.కోనవలస జాతీయ రహదారి ఘాట్‌రోడ్డుపై గురువారం ఉదయం లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. దీనిపి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన లారీ ఒడిశా నుంచి సాలూరు వైపు వస్తుండగా సాలూరు నుంచి ఒడిశా వెళ్తున్న స్కూటీ ఢీ కొ ట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీ నడుపుతున్న వ్యక్తి ఒడిశా రాష్ట్రంలోని కొరాపుట్ జిల్లా పొట్టంగి బ్లాక్‌కు చెందిన సుందరి కృష్ణ (25) అక్కడికక్కడే మతి చెందాడు, లారీ క్లీనర్, స్కూటీ వెనుక కూర్చున్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా వారిద్దరినీ సాలురు ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటన జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడని, ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన హెచ్‌సీ కృపారావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment