![వీడీవీకేలను బలోపేతం చేయాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06krp142a-370017_mr-1738869122-0.jpg.webp?itok=9PmrhNbw)
వీడీవీకేలను బలోపేతం చేయాలి
పార్వతీపురం: ప్రధానమంత్రి వన్‌ధన్ వికాస కేంద్రాల(వీడీవీకే) కార్యకలాపాలను పార్వతీపురం మన్యం జిల్లాలో మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఎ శ్యామ్‌ప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన పార్వతీపురంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో గిరిజన సహకార కార్పొరేషన్ (జీసీసీ) మేనేజింగ్ డైరెక్టర్ కల్పనాకుమారి, సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 68, సీతంపేట ఐటీడీఏ పరిధిలో 54 వీడీవీకేలున్నాయి. అటవీ ప్రాంతంలో లభించే ముడిసరుకులైన కొండ చీపుళ్లు, చింతపండు, పసుపు, జీడిపప్పు, మినుము, సబ్బులు మొదలైన వాటి ద్వారా వీడీవీకేల వ్యాపారం చేస్తూ అగరబత్తీలు, చిరుధాన్యాల బిస్కెట్లు, చింతపండు తదితరాలను ఉత్పత్తి చేస్తున్నాయని అన్నారు. పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏ ప్రాంతాల్లో కొండచీపుళ్లు, పసుపు, చింతపండు, జీడిపప్పు లభ్యత ఎక్కువగా ఉంది. జిల్లాలో దాదాపు 65 వేల హెక్టార్లలో జీడి సాగు జరుగుతుండగా, కేవలం సీతంపేట ప్రాంతంనుంచే దాదాపు ఏడు లక్షల కొండ చీపుర్లు ఉత్పత్తి అవుతున్నాయని వివరించారు. వాటన్నింటిని అధికారులు పరిగణనలోకి తీసుకుని నాణ్యమైన, పరిమాణాత్మక ఉత్పత్తులు, బ్రాండింగ్, ప్యాకింగ్‌తోపాటు మంచి మార్కెటింగ్ అందించేలా ఆలోచించాలని సూచించారు. గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ (జీసీసీ) మేనేజింగ్ డైరెక్టర్ కల్పనా కుమారి మాట్లాడుతూ అనేక శాఖలు, సంస్థలతో కలిసి ఉత్పత్తులను విక్రయించవచ్చన్నారు. సమావేశంలో పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాస్తవ, సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సి. యశ్వంత్‌కుమార్‌రెడ్డి, జీసీసీ జనరల్ మేనేజర్ సంధ్య, డివిజనల్ మేనేజర్ వి.మహేంద్రకుమార్, పార్వతీపురం ఐటీడీఏ ఏపీఓ మురళీధర్, డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ వై.సత్యంనాయుడు, సీతంపేట డీపీ సన్యాసి రామారావు, ఏపీడీఎం సన్యాసి రామారావు పాల్గొన్నారు.
కలెక్టర్ శ్యామ్ ప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment