No Headline | - | Sakshi
Sakshi News home page

No Headline

Published Fri, Jan 31 2025 1:26 AM | Last Updated on Fri, Jan 31 2025 1:27 AM

No He

No Headline

విజయనగరం రైల్వే స్టేషన్‌లో నత్తనడకన సాగుతున్న ఓవర్‌ బ్రిడ్జి పనులు

విజయనగరం టౌన్‌:

మృత్‌ భారత్‌ పథకం కింద రైల్వే స్టేషన్ల ఆధునికీకరణపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ గత బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు రూ.9,151 కోట్లు కేటాయించారు. కొత్త ట్రాక్‌లు వేసేందుకు రూ.73,743 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. 2023 ఆగస్టు 6వ తేదీన అమృత్‌ భారత్‌ పథకంలో భాగంగా 508 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులకు వర్చువల్‌ విధానంలో ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. 2024లో 73 రైల్వేస్టేషన్లను మరింత అభివృద్ధి చేసేందుకు అమృత్‌భారత్‌ స్టేషన్లుగా ఎంపిక చేశా రు. ఇందులో మన జిల్లాకు సంబంధించి విజయనగరం రైల్వేస్టేషన్‌తో పాటు చీపురుపల్లి, బొబ్బిలి, కొత్తవలస రైల్వేస్టేషన్లు ఉండడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. నాటి నుంచి నేటి వరకు అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతుండడంతో నిరాశ చెందుతున్నారు.

● పూర్తయ్యేదెన్నడో...

● ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి, ఆర్‌యూబీ పనుల్లో భాగంగా విజయనగరం రైల్వేస్టేషన్‌లో ఒకటో నంబర్‌ నుంచి నాలుగో నంబర్‌ వరకూ ఉండే పాత వంతెనను కూల్చేశారు. కొత్తగా ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫాం నుంచి చివరన ఉన్న తొమ్మిదో నంబర్‌ ప్లాట్‌ఫాం వరకూ విస్తరించనున్నారు. కంటోన్మెంట్‌ వైపు కార్యాలయాన్ని నిర్మించి, అటునుంచి ఇటువైపు ప్రయాణికులు వచ్చేలా ఏర్పాట్లు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. సంవత్సరాలు గడుస్తున్నా ఏ ఒక్క పనీ పూర్తికాలేదు.

● కంటోన్మెంట్‌ గూడ్స్‌షెడ్‌, వి.టి.అగ్రహారం, గొట్లాం బైపాస్‌ తదితర ప్రాంతాల వద్ద ఇప్పటికే ఆర్‌యూబీ, ఎఫ్‌ఓబీ పనులు పూర్తిచేశారు. మూడోలైన్‌ ప్రతిపాదనలో భాగంగా రైల్వేట్రాక్‌ల నిర్మాణ పనులు అంతంతమాత్రంగానే సాగాయి.

● ప్రయాణికులు నిత్యం ప్రయాణించే ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్‌ రైళ్లకు ఒకటో నంబర్‌, రెండు, మూడు ప్లాట్‌ఫాం కేటాయించాలి. వాటిన్నంటినీ మానేసి ప్రధాన రూట్‌లలో నిత్యం గంటల తరబడి గూడ్స్‌రైళ్లను నిలుపుదల చేయడం వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడంలేదు.

● మూడు, నాలుగు ప్లాట్‌ఫాంలపై ఉండే వ్యాపారులకు లాభసాటిగా ఉండాలనే ఉద్దేశంతో క్యాబిన్‌లో కొందరు వ్యాపారులు అధికారులతో కుమ్మకై ్క ప్రధాన రైళ్లను ఒకటి, రెండు లైన్‌లోకి వెళ్లనీయకుండా మూడు, నాలుగైదు, ప్లాట్‌ఫాంలలోకి మళ్లిస్తున్నారన్న ఆరోపణలు వినిపి స్తున్నాయి. రైళ్లను మూడు, నాలుగైదు ప్లాట్‌ఫామ్‌లపై ఆపడం వల్ల సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగులు సకాలంలో చేరుకోలేకపోతున్నారు. ఈ సమస్యపై విజిలెన్స్‌ అధికారులు దృష్టిసారించినట్టు సమాచారం.

● చీపురుపల్లి రైల్వే స్టేషన్‌ ఏర్పడి దశాబ్దాలు గడిచినా రైలు బోగీ ఎక్కడ ఆగుతుందో తెలిపే డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం సాగుతున్న ఆధునికీకరణ పనుల్లో ఏర్పాటుచేస్తారో లేదో వేచిచూడాల్సిందే.

● బొబ్బిలి స్టేషన్‌లో గూడ్స్‌ రైళ్లకు లోడింగ్‌ పాయింట్‌ ఎత్తేస్తారన్న సమాచారంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. దీనిని అడ్డుకోవాలని కోరుతూ పాలకులకు విన్నవిస్తున్నారు.

మన్యంలో.. ‘గజ’ ఘీంకారం..!

మన్యం జిల్లాలో గజరాజుల ఘీంకారాలు నిత్యకృత్యమయ్యాయి. ప్రజల ప్రాణాలు, పంటలు, ఆస్తులకు రక్షణ కరువైంది.

రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ, అభివృద్ధికోసం కేంద్ర ప్రభుత్వం అమృత్‌ భారత్‌ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. తొలుత 508 స్టేషన్లు ఎంపిక చేయగా, అందులో మన జిల్లాకు సంబంధించి విజయనగరం, బొబ్బిలి, చీపురుపల్లి, కొత్తవలస రైల్వేస్టేషన్లు ఉండడంతో ప్రయాణికులు సంతోషించారు. ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని ఆశపడ్డారు. తీరా పనులు నత్తనడకన సాగుతుండడంతో ఆవేదన చెందుతున్నారు.

అంతంత మాత్రంగా సాగుతున్న

అమృత్‌భారత్‌ అభివృద్ధి పనులు

ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో రెండే రెండు జనరల్‌ బోగీలతో ప్రయాణికుల అవస్థలు

ప్రధాన లైన్లలో గూడ్స్‌రైళ్ల నిలుపుదలతో ఇక్కట్లు

అధికారులు సమీక్షిస్తున్నా

ముందుకు కదలని నిర్మాణాలు

జనరల్‌ బోగీలు లేక తప్పని తిప్పలు

అభివృద్ధి, ఆధునికీకరణకు పెద్దపీట వేస్తున్నామన్న మోదీ సర్కారు సాధారణ ప్రజల వైపు కన్నెత్తిచూడడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయనగరం జిల్లా మీదుగా రాకపోకలు సాగించే ప్రధాన ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో నాలుగు జనరల్‌ బోగీలకు కేవలం రెండే రెండు ఉండడం గమనార్హం. ఇక స్లీపర్‌ క్లాస్‌ పరిశీలిస్తే గతంలో 12 వరకూ ఉండేవి. ఇప్పుడు ముచ్చటగా మూడు మాత్రమే దర్శనమిస్తున్నాయి. వీటితో పాటు దివ్యాంగులకు ఒకటి, మహిళలకు ఒకటి, మిగతావన్నీ ఏసీ బోగీలే ఉండడంతో సాధారణ ప్రయాణికుల అవస్థలు వర్ణణాతీతం.

ఇచ్ఛాపురం, సోంపేట, పలాస, మందస, నౌపడ, కోటబొమ్మాళి, తిలారు, శ్రీకాకుళం, చీపురుపల్లి, విజయనగరం తదితర ప్రాంతాల్లో ప్రతిచోటా ప్రధాన రైళ్లను ప్రయాణికులు ఆశ్రయిస్తుంటారు. డిమాండ్‌ ఉన్న రైళ్లలో జనరల్‌ బోగీలు, స్లీపర్‌ క్లాస్‌ బోగీలు తగ్గిపోవడంతో ప్రయాణికులు మహిళా బోగీలను ఆశ్రయించి ఆర్‌పీఎఫ్‌, జీఆర్‌పీ పోలీసుల చర్యలకు గురికావాల్సి వస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
No Headline1
1/4

No Headline

No Headline2
2/4

No Headline

No Headline3
3/4

No Headline

No Headline4
4/4

No Headline

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement