పోలీస్ జాగిలం ‘వీణ’ మృతి
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్ శాఖలో స్నిఫర్ డాగ్‌గా విశేష సేవలందించిన ‘వీణ’ మృతిచెందింది. ఎస్పీ ఆదేశాల మేరకు అధికారిక లాంఛనాలతో అయ్యన్నపేట శ్మశానవాటికలో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ మేరకు ఏఆర్ అద నపు ఎస్పీ జి.నాగేశ్వరరావు మాట్లాడుతూ 2014లో ఫిమేల్ స్నిఫర్ డాగ్‌గా వీణ ఇంటిలిజెన్స్ విభాగంలో శిక్షణ పూర్తిచేసుకుని జిల్లాకు వచ్చిందన్నారు. శిక్షణ సమయంలో వీణాకు వెంకటరావు అనే ఏఆర్ కానిస్టేబుల్ హ్యాండలర్‌గా వ్యవహరించేవారని, ఆయన 2021లో మృతిచెందడంతో ఆ బాధ్యతలను మరో ఏఆర్ కానిస్టేబుల్ ఎన్.శ్రీనివాసరావు (జానీ)కి అప్పగించామన్నారు. జాగిలం తన తుదిశ్వాస వరకూ జిల్లా పోలీస్ శాఖకు సేవలందించిందన్నారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ చేపట్టే ముందస్తు భద్రత చర్యల్లో చురుగ్గా పాల్గొని, ఎక్స్‌ప్లోజివ్స్‌ను గుర్తించేందుకు తనిఖీలు నిర్వహించేదన్నారు. పోలీస్ డ్యూటీ మీట్స్‌లోనూ ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టులు పాతిపెట్టిన ల్యాండ్ మైన్స్, ఎక్స్‌ప్లోజివ్ వస్తువులను గుర్తించడంలో చురుగ్గా వ్యవహరించి, పోలీసుల మన్ననలు పొందిందన్నారు. వృద్ధాప్యంతో వీణ మృతిచెందినట్లు వెటర్నరీ డాక్టర్ ధర్మారావు నిర్ధారించారన్నారు. జాగిలం అంత్యక్రియల్లో ఏఆర్ డీఎస్పీ యూనివర్స్, ఆర్‌ఐలు టి.శ్రీనివాసరావు, ఎన్.గోపాలనాయుడు, ఆర్.రమేష్‌కుమార్, ఆర్‌ఎస్‌ఐలు, డాగ్, బాంబ్ స్క్వాడ్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని నివాళులర్పించారు.
అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
Comments
Please login to add a commentAdd a comment