శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యం
తెర్లాం: సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఈ ఏడాది పదో తరగతి చదువుతున్న విద్యార్థులందరూ ఉత్తీర్ణులు కావడంతో పాటు, అత్యధిక మార్కులు సాధించేలా చదవాలని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరక్టర్ బి.రామానందం పిలుపునిచ్చారు. తెర్లాంలోని ఎస్సీ వసతి గృహంలో శుక్రవారం బొబ్బిలి ఏఎస్‌డబ్ల్యూఓ సత్యనారాయణ ఆధ్వర్యంలో తెర్లాం, పెరుమాళి, బాడంగి, రామభద్రపురం, గుళ్ల సీతారాంపురం ఎస్సీ హాస్టళ్లలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్జెక్టుల్లో ఏవైనా సందేహాలుంటే ట్యూటర్లను అడిగి నివృత్తిచేసుకో వాలన్నారు. వసతి గృహాల సంక్షేమాధికారులు ప్రతిరోజూ ఉదయం, రాత్రి వేళల్లో విద్యార్థులను చదివించాలని తెలిపారు. బొబ్బిలి ఏఎస్‌డబ్ల్యూఓ సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులకు పదో తరగతి మొదటి మెట్టు అని, దీనిలో విజయం సాధిస్తే మిగిలిన చదువంతా సునాయాసంగా సాగిపోతుందన్నారు. అవగాహన సదస్సులో హాస్టళ్ల వార్డెన్లు అప్పన్న, కృష్ణమూర్తి, రాంబాబు, వెంకటరావు, రమేష్, విశ్రాంత వార్డెన్ నరసింహమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
రూ.4.67కోట్లతో ఎస్సీ వసతి గృహాల్లో
మరమ్మతు పనులు
జిల్లాలోని అన్ని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో రూ.4.67 కోట్ల ఖర్చుతో మరమ్మతు పనులు చేపడతామని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరక్టర్ బి.రామానందం చెప్పారు. తెర్లాంలోని ఎస్సీ వసతి గృహంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని వసతి గృహాల్లో 2,200మంది విద్యార్థులు చదువుతున్నారని, వీరికి పుస్తకాలు, ఆట వస్తువులు, వసతి గృహాలకు అవసరమైన వంట పాత్రలు, గ్యాస్‌స్టౌవ్‌లు పంపిణీ చేశామన్నారు. జిల్లాలోని 6 ఎస్సీ వసతి గృహాలకు పీఎం అజయ్ పథకం కింద నూతన భవనాలు నిర్మించేందుకు రూ.18కోట్లు మంజూరయ్యాయని, టెండర్ ప్రక్రియ పూర్తికావాల్సి ఉందన్నారు.
జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రామానందం
తెర్లాం ఎస్సీ హాస్టల్‌లో పదోతరగతి విద్యార్థులకు
నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడుతున్న
జిల్లా సోషల్ వెల్ఫేర్ డీడీ రామానందం
Comments
Please login to add a commentAdd a comment