మంత్రి కేటీఆర్‌కు పుష్పగుచ్ఛం అందిస్తున్న కలెక్టర్
వరంగల్ అర్బన్: రాష్ట్ర పురపాలక శాఖ, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య మర్యాద పూర్వకంగా కలిశారు. శుక్రవారం హనుమకొండ పర్యటనలో భాగంగా కిట్స్ ఇంజనీరింగ్ కాలేజీకి హెలికాప్టర్‌లో చేరుకున్న మంత్రిని కలెక్టర్ ప్రావీణ్య కలిసి పుష్పగుచ్ఛం అందించారు.
సీడీఎంఏకు స్వాగతం పలికిన అధికారులు
కరీమాబాద్: హనుమకొండ పర్యటనలో భాగంగా శుక్రవారం వరంగల్ కలెక్టరేట్‌కు వచ్చిన రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణకు అధికారులు ఘన స్వాగతం పలికారు. కలెక్టర్ ప్రావీణ్య పూల మొక్కను అందించారు. అడిషనల్ కలెక్టర్లు శ్రీవత్స కోట, అశ్విని తానాజీ వాకడే పుష్పగుచ్ఛాలు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment