236 మందికి టూడీ ఎకో పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

236 మందికి టూడీ ఎకో పరీక్షలు

Published Fri, Jan 31 2025 1:25 AM | Last Updated on Fri, Jan 31 2025 1:25 AM

236 మందికి  టూడీ ఎకో పరీక్షలు

236 మందికి టూడీ ఎకో పరీక్షలు

గుండె పరీక్షల శిబిరానికి

అనూహ్య స్పందన

ఎంజీఎం : ఎంజీఎం ఆస్పత్రి ప్రాంగణంలోని డిస్ట్రిక్ట్‌ ఎర్లీ ఇంటర్వేన్షన్‌ కేంద్రం(డైక్‌)లో గురువారం చిన్న పిల్లల కోసం నిర్వహించిన గుండె పరీక్షల శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. శిబిరంలో 236 మంది పిల్లలకు గుండె సంబంధ టూడీ ఎకో పరీక్షలు నిర్వహించగా 75 మంది చిన్నారులకు శస్త్ర చికిత్స అవసరమని గుర్తించారు. 15 మందిని నిర్ధారణ కోసం ఇతర పరీక్షల నిమిత్తం రెఫర్‌ చేసినట్లు డీఎంహెచ్‌ఓ సాంబశివరావు తెలిపారు. శస్త్ర చికిత్స అవసరం ఉన్న వారిని ఆరోగ్య శ్రీ పథకంలో ఉచితంగా ఆపరేషన్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. చిన్న పిల్లల్లో వచ్చే గుండె సంబంధ వ్యాధులను డీఈఐసీ ద్వారా ముందే గుర్తించి శస్త్ర చికిత్స చేస్తే భవిష్యత్‌లో వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటుందని చెప్పారు. అపోలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ఆధ్వర్యాన ఎంజీఎం ఆస్పత్రిలో డీఈఐసీ, ఆర్‌బీఎస్‌కే మొబైల్‌ టీమ్స్‌ సహకారంతో ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించినట్లు వివరించారు. కార్యక్రమంలో ఎంజీఎం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిశోర్‌, ఆర్‌ఎంఓ అంబి శ్రీనివాస్‌, డీఐఓ ప్రకాశ్‌ తదితరులున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement