సాక్షిప్రతినిధి, వరంగల్‌ : | - | Sakshi
Sakshi News home page

సాక్షిప్రతినిధి, వరంగల్‌ :

Published Fri, Jan 31 2025 1:24 AM | Last Updated on Fri, Jan 31 2025 1:24 AM

సాక్షిప్రతినిధి, వరంగల్‌ :

సాక్షిప్రతినిధి, వరంగల్‌ :

టీ సంస్థలు ఓరుగల్లు వైపు చూస్తున్నాయి. హైదరాబాద్‌ తర్వాత తెలంగాణలో అంతటి ప్రాధాన్యంకలిగిన రెండో నగరం వరంగల్‌. అదేస్థాయిలో అభివృద్ధి చేసే క్రమంలో 2016లో అప్పటి ప్రభుత్వం ఇక్కడ ఐటీ పార్కును ఏర్పాటు చేసింది. మడికొండ ఐటీ సెజ్‌లో దశల వారీగా సయాంట్‌, టెక్‌ మహేంద్ర, జెన్‌ఫ్యాక్ట్‌, క్వాండ్రెంట్‌ రిసోర్స్‌లు తమ బ్రాంచీలను తెరిచాయి. సుమారు మూడేళ్ల కిందట రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో రూ.1,656 కోట్లతో 196 ఎకరాల్లో టెక్నాలజీస్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన ఫాక్స్‌కాన్‌.. వరంగల్‌లో బ్రాంచ్‌ ఏర్పాటుకు అప్పుడే అంగీకారం తెలిపింది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌రావు తదితరులు దావోస్‌ పర్యటన సందర్భంగా వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంలో పలు కంపెనీలతో అగ్రిమెంట్‌ జరిగిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ టెక్నాలజీ సంస్థ సిఫీ వరంగల్‌లో బ్రాంచీని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ప్రభుత్వం ఐటీ పరిశ్రమలను ప్రోత్సహిస్తున్న తరుణంలో తాజాగా ఐటీరంగ సంస్థలు ఓరుగల్లు వైపు చూస్తుండడంపై యువతలో ‘ఉపాధి’ ఆశలు చిగురిస్తున్నాయి.

త్వరలోనే మరిన్ని ఐటీ కంపెనీలు..

టెక్‌ మహేంద్ర ప్రస్తుతం హైదరాబాద్‌లోనే కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, సయాంట్‌, జెన్‌ఫ్యాక్ట్‌, క్వాడ్రంట్‌ రిసోర్సెస్‌తో పాటు సాఫ్ట్‌పాత్‌ వంటి సంస్థలు ఓరుగల్లులో తమ బ్రాంచీలను నిర్వహిస్తున్నాయి. సిఫీ తాజాగా ఎంఓయూ కుదుర్చుకోవడంతో మరిన్ని ఐటీ సంస్థలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు వరంగల్‌ ప్రజాప్రతినిధులు ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో సుముఖత వ్యక్తం చేసిన హెచ్‌ఆర్‌హెచ్‌ నెక్స్‌, హెక్సాడ్‌, ఎల్‌టీఐ మైండ్‌ ట్రీ ఐటీ కంపెనీలతో చర్చలు జరిపినట్లు సమాచారం. విస్తరణ బాటలో ఉన్న అమెరికాలోని హ్యూస్టన్‌కి చెందిన టెక్‌వేవ్‌ సంస్థ కూడా ఓరుగల్లులో బ్రాంచ్‌ని తెరిచే యోచనలో ఉందని తెలిసింది. ఇండియన్‌ ఎన్నారైలకు చెందిన ఈ ఐటీ సంస్థ ప్రతినిధులతో కూడా మాట్లాడినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సయాంట్‌, జెన్‌ఫ్యాక్ట్‌, సాఫ్ట్‌పాత్‌, క్వాడ్రంట్‌ రిసోర్సెస్‌ సంస్థల సరసన ఫాక్స్‌కాన్‌, హెచ్‌ఆర్‌హెచ్‌ నెక్స్‌, హెక్సాడ్‌, ఎల్‌టీఐ మైండ్‌ ట్రీ, టెక్‌వేవ్‌ తదితర ఐటీ కంపెనీలు చేరితే రెండు వేల వరకు కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఏళ్ల తరబడిగా పెండింగ్‌లో ఉన్న మామునూరు ఎయిర్‌ పోర్ట్‌ పునరుద్ధరణ ప్రయత్నాలు ముందుకు సాగుతుండడంతో హైదరాబాద్‌ కేంద్రంగా ఐటీ సేవలందిస్తున్న సంస్థలు వరంగల్‌ వైపు చూస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతంగా.. హెల్త్‌సిటీ, ఎడ్యుకేషన్‌ హబ్‌గా పేరున్న వరంగల్‌ త్వరలో ఐటీహబ్‌గా మారే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటికే మడికొండలో ప్రముఖ కంపెనీల బ్రాంచ్‌లు

సయాంట్‌, క్వాడ్రంట్‌, జెన్‌ఫ్యాక్ట్‌లు.. ఫాక్స్‌కాన్‌ సంప్రదింపులు

దావోస్‌లో అగ్రిమెంట్‌కు ఓకే అన్న సిఫీ ఉపాధిపై యువత ఆశలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement