నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలి
జిల్లా పరిషత్ సీఈఓ విద్యాలత
దామెర: రానున్న వేసవిని దృష్టిలోఉంచుకొని గ్రా మాల్లో నీటి ఎద్దడి నివారణకు అధికారులు చర్యలు చేపట్టాలని జెడ్పీ సీఈఓ విద్యాలత అధికారులను ఆదేశించారు. మండలంలోని ల్యాదెల్ల, సింగరాజుపల్లి గ్రామాల్లో వాటర్ ట్యాంకులు, నర్సీలను మంగళవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా జెడ్పీ సీఈఓ మాట్లాడుతూ గ్రామాల్లో నీటి సమస్య లేకుండా అధికారులు చూడాలని తెలిపారు. మి షన్ భగీరథ నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తితే ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని, నర్సరీల్లో ఉన్న మొక్కలు ఎండిపోకుండా చూసుకోవాలని సూచించారు. జెడ్పీ సీఈఓ వెంట ఎంపీడీఓ విమల, ఎంపీఓ రంగాచారి, ఏపీఓ శారద, పంచాయతీ కార్యదర్శి మనోహర్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment