ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు పొడిగింపు | - | Sakshi
Sakshi News home page

ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు పొడిగింపు

Apr 3 2025 1:14 AM | Updated on Apr 3 2025 1:14 AM

ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు పొడిగింపు

ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు పొడిగింపు

వరంగల్‌ అర్బన్‌: లేఔట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) 25 శాతం రాయితీ గడువు ఏప్రిల్‌ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు పురపాలక ప్రిన్సిపల్‌ సెక్రటరీ కిశోర్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్‌ చేసుకునే వీలును ప్రభుత్వం కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా.. గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలో 16వేల మంది ఇప్పటికే రాయితీని వినియోగించుకున్నారు. తద్వారా బల్దియాకు రూ.102 కోట్ల ఆదాయం సమకూరింది. గడువు పొడిగింపుతో మరో 50 వేల మంది రాయితీని వినియోగించుకునే అవకాశాలున్నాయి.

వ్యవసాయాధికారుల ఫోన్‌ నంబర్ల మార్పు

హన్మకొండ: హనుమకొండ జిల్లాలోని వ్యవసాయాధికారులు ఇప్పటి వరకు వినియోగించిన ఫోన్‌ నంబర్ల స్థానంలో కొత్త ఫోన్‌ నంబర్లను ప్రభుత్వం కేటాయించినట్లు హనుమకొండ జిల్లా వ్యవసాయాధికారి రవీందర్‌ సింగ్‌ తెలిపారు. రైతులు కొత్త ఫోన్‌ నంబర్లలో అధికారులను సంప్రదించాలని కోరారు. జిల్లా వ్యవసాయాధికారి బి.రవీందర్‌ సింగ్‌ 89777 56346, ఏఓ టెక్నికల్‌ డి.శ్రీధర్‌ రెడ్డి, 89777 56348, ఏఓ టెక్నికల్‌ టి.కమలాకర్‌ 89777 56349, ఏఓ టెక్నికల్‌ ఎండీ అఫ్జల్‌ పాషా 89777 56350, హనుమకొండ ఏడీఈ 89777 44964, భీమదేవరపల్లి ఏఓ 89777 44965, ధర్మసాగర్‌ ఏఓ 89777 44966, ఎల్కతుర్తి ఏఓ 89777 44967, హనుమకొండ ఏఓ 89777 44968. హసన్‌పర్తి ఏఓ 89777 44969, ఐనవోలు ఏఓ 89777 44970, కాజీపేట ఏఓ 89777 44971, వేలేరు ఏఓ 89777 44972, హనుమకొండ ఏడీఏ పీఏ 89777 44975, పరకాల ఏడీఏ 89777 44976, ఆత్మకూరు ఏఓ 89777 44977, దామెర ఏఓ 89777 44978, నడికూడ ఏఓ 89777 44979, పరకాల ఏఓ 89777 44980, శాయంపేట ఏఓ 89777 45013, పీఏ టు పరకాల ఏడీఏ 89777 45014 నంబర్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.

పీహెచ్‌సీ ఆకస్మిక తనిఖీ

ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండలం గోపాల్‌పూర్‌ పీహెచ్‌సీని (డీఎంహెచ్‌ఓ) జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్‌సీలోని రికార్డులు పరిశీలించారు. అలాగే.. పలు మందులకు సంబంధించి స్టాక్‌ వివరాలు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. 1704 మంది బీపీ, 874 మంది షుగర్‌ పేషెంట్లకు సరైన మందులు అందజేయడంతో పాటు తగిన ఫాలో అప్‌ సేవలందించాలన్నారు. వ్యాక్సిన్‌ స్టోరేజీని పరిశీలించారు. ప్రసవాలు ఎక్కువగా జరిగేలా గర్భిణులను ప్రోత్సహించాలన్నారు. పీహెచ్‌సీలోని అన్ని ఉప కేంద్రాల పరిధిలో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూడాలని, ప్రజలకు, ఉపాధి హామీ కూలీలకు వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. అలాగే జీల్గుల, దండేపల్లి గ్రామాల్లో వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం అమలును పరిశీలించారు. దండేపల్లిలోని ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌ భవన నిర్మాణాన్ని పరిశీలించి సంబంధిత కాంట్రాక్టర్‌ను త్వరగా నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట డాక్టర్‌ విజేందర్‌రెడ్డి, హెల్త్‌ సూపర్‌వైజర్‌ సంపత్‌రెడ్డి, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు ఉన్నారు.

రైతులు, ఫారెస్ట్‌ అధికారుల మధ్య వాగ్వాదం

ధర్మసాగర్‌: ముప్పారం, దేవునూరు గ్రామాల శివారు ఇనుపరాతి గుట్టల సమీపంలో ఫారెస్ట్‌ నోటిఫికేషన్‌లో లేని రైతుల భూములకు హద్దులు ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులు ఫారెస్ట్‌ అధికారులకు సూచించారు. కొంతకా లంగా ముప్పారం గ్రామ శివారు సర్వే నంబర్లు 214, 215, 216, దేవునూరు గ్రామ శివా రులోని 403,404 సర్వే నంబర్లలోని సుమారు 25 ఎకరాల భూమి ఆయా గ్రామాల రైతుల పట్టా భూములని రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. వాటిని ఫారెస్ట్‌ అధికారులు తమవేనని చెబుతుతున్నారు. ఈవిషయమై గతంలో జరిగిన వివాదంతో రైతులు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఫారెస్ట్‌ నోటిఫికేషన్‌లో లేని రైతులకు సంబంధించిన పట్టా భూములను రైతులకు హద్దులు ఏర్పాటు చేసి చూపించాలని స్థానిక రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈక్రమంలో బుధవారం రైతులు జేసీబీలతో ఆ భూమిని చదును చేస్తుండగా మరోసారి రైతులకు, ఫారెస్ట్‌ అధికారులకు మధ్య వివాదం జరిగింది. దీంతో స్థానిక తహసీల్దార్‌ సదానందం, సీఐ ప్రవీణ్‌ కుమార్‌ వారిని సముదాయించారు. రెండు రోజుల్లో ఈ భూములపై సరైన నిర్ణయం తీసుకోవాలని ఫారెస్ట్‌ అధికారులకు రెవెన్యూ, పోలీస్‌ వారు సూచించారు. దీంతో రైతులు, ఫారెస్ట్‌ అధికారులు అక్కడినుంచి వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement