
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
ఖానాపురం: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు, కోలిన్ ఏరోస్పేస్ సీఎస్‌ఆర్ అమిత్ సావర్కర్ అన్నారు. మండల కేంద్రంలోని దత్తాత్రేయ ఎస్‌హెచ్‌జీకి బెంగళూరుకు చెందిన కోలిన్ ఏరోస్పేస్ సంస్థ ఆధ్వర్యంలో రూ.4.50 లక్షల విలువ చేసే డ్రోన్ పిచికారీ యంత్రాన్ని శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు బాధ్యతాయుతంగా వాడుకుంటూ ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు. కోలిన్ ఏరోస్పేస్ సంస్థ కర్ణాటకలో 2,500 మందితో కూడిన ఎఫ్‌పీఓతో పనిచేస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం తమవంతు సహకారాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్‌నగర్, వరంగల్‌తో పాటు పలు ప్రాంతాలకు చెందిన వారు డ్రోన్ల కోసం దరఖాస్తు చేసుకోగా ఖానాపురంలో మహిళా సంఘానికి అందించినట్లు వివరించారు. ఇన్సూరెన్స్ చేసి డ్రోన్లు అందిస్తున్నామని, భవిష్యత్‌లో మరిన్ని అందజేస్తామన్నారు. ఏఓ శ్రీనివాస్, సొసైటీ సీఈఓ ఆంజనేయులు, కార్యదర్శి సుప్రజ, ప్రజలు వెంకటప్రసాదరావు, సత్యవరప్రసాదరావు, వాసుదేవరెడ్డి, శ్రీను, ఎస్‌హెచ్‌జీ అధ్యక్షురాలు వేజేళ్ల సుజిత, మేరుగు రాజు, సంస్థ బాధ్యులు లవీన్ సుందరరాజ్, గణేశ్, ఫణీంద్ర, రాధ, బలరాం, నందగోపాలం, అరుణ్ పాల్గొన్నారు.