కనుల పండువగా రథోత్సవం
ముగిసిన బలివే శివరాత్రి ఉత్సవాలు
బలివే(ముసునూరు): బలివేలోని రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద మహాశివరాత్రి ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయి. బలివే క్షేత్రానికి గురు, శుక్రవారాల్లో వేలాదిగా భక్తులు తరలి వచ్చి, తమ్మిలేరు, జల్లు స్నానాల వద్ద అమావాస్య స్నానా లాచరించి స్వామిని దర్శించుకున్నారు. పితృదేవతలకు ముక్తి కలగాలని బ్రాహ్మణులకు, పేదలకు దా నాలు చేశారు. గురువారం రాత్రి స్వామికి బలివే గ్రామ వీధుల్లో వైభవంగా రథోత్సవం నిర్వహించారు. భక్తులు రాజరాజేశ్వరీ సమేత రామలింగేశ్వరస్వామి ఉత్సవమూర్తులను దర్శించుకున్నారు. సీఐ రామకృష్ణ, ఎస్సై ఎం.చిరంజీవి బందోబస్తు నిర్వహించారు. శుక్రవారం ఉదయం బిందె తీర్థం, బలిహరణ, వసంతోత్సవం, అవభృతం, సాయంత్ర హోమం, బలిహరణాదులు, పూర్ణాహుతి, ద్వాదశ ప్రదక్షిణాలు నిర్వహించారు. రాత్రి ధ్వజావరోహణం చేసి భక్తి శ్రద్ధలతో పవళింపు సేవ నిర్వహించారు. దీంతో శివరాత్రి ఉత్సవాలు ముగిసినట్లు అధికారులు తెలిపారు.
హుండీల ఆదాయం రూ.13.77 లక్షలు
మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా బలివే రామలింగేశ్వర స్వామి ఆలయానికి హుండీల ద్వారా రూ.13.77 లక్షల ఆదాయం లభించినట్లు ఈఓ పామర్తి సీతారామయ్య తెలిపారు. శుక్రవారం ఆలయం వద్ద ఉత్సవాల అధికారి కె.అనూరాధ పర్యవేక్షణలో హుండీల లెక్కింపు నిర్వహించారు. అనంతరం ఆదాయ వివరాలను వెల్లడించారు. శా శ్వత, తాత్కాలిక హుండీల ద్వారా రూ. 13,77,951 ఆదాయం లభించగా, పూజా టికెట్లు, విరాళాల ద్వారా స్వామికి సుమారు రూ.12 లక్షల ఆదాయం లభించిందన్నారు. కార్యక్రమాల్లో సర్పంచ్ రావు ప్రవీణ, భక్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment