
రేపు వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం
సాక్షి, భీమవరం: వైఎస్సార్‌సీపీ 14వ ఆవిర్భావ దినోత్స వం సందర్భంగా ఈనెల 12న జిల్లాలో ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు సోమవారం తెలిపారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం ఉదయం 9 గంటలకు జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ జెండా ఆవిష్కరణలు ఉంటాయన్నారు. అనంతరం కూటమి ప్రభుత్వ మోసంతో నష్టపోతున్న యువత, విద్యార్థులకు బాసటగా నిలిచేందుకు తలపెట్టిన ‘యువత పోరు’కు జిల్లా నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు భీమవరం చేరుకుంటారని తెలిపారు. ప్రభుత్వ తీరును ఎండగడుతూ భారీ ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకుని నిరసన కార్యక్రమంలో పాల్గొంటామన్నారు. పార్టీ శ్రేణులు ఆయా కార్యక్రమాలను విజయవంతం చేయాలని ప్రసాదరాజు కోరారు.
నేడు మున్సిపల్ ఆర్డీ సమీక్ష
నరసాపురం: జిల్లాలోని మున్సిపల్ కమిషన ర్లు, అధికారులతో మంగళవారం ఉదయం 10 గంటలకు నరసాపురం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఆర్డీ (రాజమండ్రి) సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. నరసాపురం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం, ఆకివీడు మున్సిపల్ అధికారులు పాల్గొంటారని నరసాపురం మున్సిపల్ కమిషనర్ ఎం.అంజయ్య తెలిపారు.
ఇంటర్ పరీక్షలకు 96.9 శాతం హాజరు
భీమవరం: జిల్లావ్యాప్తంగా సోమవారం 52 కేంద్రాల్లో నిర్వహించిన ఇంటర్మీడియెట్ సెకండియర్ పరీక్షలకు 96.9 శాతం విద్యార్థులు హాజరయ్యారు. జనరల్ పరీక్షలకు 13,598 మందికి 13,228 మంది, ఒకేషనల్ పరీక్షలకు 1,535 మందికి 1,441 మంది హాజరయ్యారని డీఐఈఓ ఎ.నాగేశ్వరరావు తెలిపారు.
గోదావరి జిల్లాల్లో ఉప్పునీటి సమస్య
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు కేంద్రాన్ని పలు ప్రశ్నలు అడగ్గా.. కేంద్ర మంత్రులు రాతపూర్వకంగా సమాధానాలు ఇ చ్చారు సముద్ర తీర ప్రాంతంలోని తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలు ఉప్పు సమస్యను ఎదుర్కొంటున్నట్టు కేంద్ర జల్‌శక్తి సహాయ మంత్రి రాజ్ భూషణ్‌చౌదరి తెలిపారు. గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌లో సముద్ర తీర ప్రాంతాల్లో ఉప్పు చేరడం వలన అక్కడ పర్యావరణం దెబ్బతింటోందని, ఏయే ప్రాంతాలు ఉప్పు సమస్యను ఎదుర్కొంటున్నాయని వైఎస్సార్‌సీపీ ఎంపీ పరిమళ్ నత్వాని ప్రశ్నకు కేంద్ర మంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. 2012–23 వరకు జాతీయ జలాశయ మ్యాపింగ్ అధ్యయనాల్లో ఏపీలో భూగర్భ జలాలపై అధ్యయనం చేసినట్లు తెలిపారు.
ఇంటర్ పరీక్షలకు 12,485 మంది హాజరు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : జిల్లాలోని 55 కేంద్రా ల్లో సోమవారం జరిగిన ఇంటర్ సెకండియర్ పరీక్షలకు 12,826 మందికి 12,485 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 11,022 మంది జనరల్ విద్యార్థులకు 10,809 మంది, 1,804 మంది ఒకేషనల్ విద్యార్థులకు 1,676 మంది హాజరయ్యారని ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాన్ తెలిపారు.
ఓపెన్ పరీక్షలకు..
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) ఇంటర్ పరీక్షలకు సోమవారం 165 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. భౌతిక శాస్త్రం పరీక్షకు 317 మందికి 268 మంది , రాజనీతి శాస్త్రం పరీక్షకు 470 మందికి 354 మంది హాజరయ్యారని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు.
టెన్త్ విద్యార్థులకు ఉచిత ప్రయాణం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని జిల్లా ప్రజా రవాణా అధికారి ఎన్‌వీఆర్ వరప్రసాద్ ప్రకటనలో తెలిపారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డిపోల పరిధిలో ఈనెల 17 నుంచి వచ్చేనెల 1 వరకు విద్యార్థులు హాల్‌టికెట్ చూపించి ప్రయాణించవచ్చని, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో అనుమతిస్తారని పేర్కొన్నారు.

రేపు వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం
Comments
Please login to add a commentAdd a comment