సీనియర్లకు మరోసారీ
సాక్షి, భీమవరం: ఎమ్మెల్సీ పదవిపై గంపెడాసతో ఉన్న జిల్లాలోని కూటమి సీనియర్ నేతలకు చుక్కెదురైంది. ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో వీరికి అవకాశం దక్కలేదు. అధినేత మాటకు కట్టుబడి మిత్రపక్ష అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే తమకు గుర్తింపు లేకుండా పోయిందన్న ఆవేదనలో వారంతా ఉన్నారు. జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను కూటమి సీట్ల సర్దుబాటులో ఆచంట, తణుకు, పాలకొల్లు, ఉండి నియోజకవర్గాలు టీడీపీ, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెంలలో జనసేన పోటీచేశాయి. దీంతో ఆయా నియోజకవర్గాల్లోని మిగిలిన రెండు పార్టీల నుంచి సీట్లు దక్కని ఆశావహులకు ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవులతో సముచిత స్థానం కల్పిస్తామని చంద్రబాబు, పవన్‌కల్యాణ్ భరోసా ఇచ్చారు. తాడేపల్లిగూడెంలో టీడీపీ నుంచి టికెట్ ఆశించిన వలవల బాబ్జి, నరసాపురంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మా ధవనాయుడు, ఎన్‌ఆర్‌ఐ కొవ్వలి యతిరాజరామ్మోహననాయుడు, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పొ త్తూరి రామరాజు, భీమవరంలో టీడీపీ నేత తోట సీతారామలక్ష్మి, జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, ఉండి నియోజకవర్గంలో జనసేన ఇన్‌చార్జి జుత్తుక నాగరాజు, పాలకొల్లులో జనసేన ఇన్‌చార్జి బోనం చినబాబు తదితర నేతలతో అప్పట్లో సంప్రదింపులు జరిపారు. వీరిలో వలవల బాబ్జి, బండారు మాధవనాయుడు, తోట సీతారామలక్ష్మికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తారని అప్పట్లో చంద్రబాబు హామీ ఇచ్చినట్టు చర్చ జరిగింది.
మదనపడుతూ..
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాల కోసం ఆయా పార్టీల్లో సీనియర్లు ఎదురుచూస్తున్నారు. అయితే వీ రికి నిరాశే ఎదురైంది. భీమవరానికి చెందిన బీజేపీ సీనియర్ నేత పాకా సత్యనారాయణ గతంలో ఎంపీ టికెట్ ఆశించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ రేసులో ఉన్నారన్న ప్రచారం జరిగింది. అయితే ఆయనకు పదవి రాకపోవడం వెనుక స్థానికంగా పలు శక్తులు పనిచేశాయన్న ప్రచారం జరుగుతోంది. కూటమి అధికారంలోకి వచ్చాక రెండు విడతల్లో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయగా వాటిలోనూ తమ పేర్లు ప్ర స్తావనకు రాకపోవడంతో పలువురు నేతలు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రతిపక్షంగా ఐదేళ్ల పాటు పార్టీని నెట్టుకుని వస్తే అధికారంలోకి వచ్చాక పదవులను మరొకరు ఎంజాయ్ చేస్తున్నారని సీనియర్లు మదనపడుతున్నట్టు సమాచారం.
ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిన నేతలకు మొండిచేయి
నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ దక్కని అవకాశం
సీనియర్లకు మరోసారీ
సీనియర్లకు మరోసారీ
Comments
Please login to add a commentAdd a comment