
అంగన్‌వాడీలపై నిర్బంధం అమానుషం
నరసాపురం: సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజాస్వామ్యయుతంగా ఆందోళనకు వెళుతున్న అంగన్‌వాడీ కార్యకర్తలను అడ్డుకుని నిర్బంధించడం అమానుషమని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముచ్చర్త త్రిమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం విజయవాడలో మహా ధర్నాకు నరసాపురం నుంచి పెద్దెత్తున బయలుదేరగా ఉదయం 10 గంటలకు రైల్వేస్టేషన్‌కు చేరిన అంగన్‌వాడీలను పోలీసులు అడ్డగించి, వెనక్కి పంపించేయడం దారుణమన్నారు. దీనిపై ఆగ్రహించిన అంగన్‌వాడీలు నోటికి నల్లగంతలు కట్టుకుని పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు.
పాలకొల్లులో..
పాలకొల్లు సెంట్రల్: అంగన్‌వాడీలను నిర్బంధించడం దారుణమని సీఐటీయూ నాయకుడు జవ్వాది శ్రీనివాసరావు అన్నారు. పాలకొల్లులో పలువురిని ఇళ్ల వద్దే కాకుండా, రైల్వేస్టేషన్ వద్ద సుమారు 100 మంది అంగన్‌వాడీలను నిర్బంధించడంపై మండిపడ్డారు. అంగన్‌వాడీలు రైల్వేస్టేషన్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వ చర్యలను ఎండగట్టారు.

అంగన్‌వాడీలపై నిర్బంధం అమానుషం
Comments
Please login to add a commentAdd a comment