భీమవరంలో ‘యూత్ పార్లమెంట్’
భీమవరం (ప్రకాశంచౌక్): పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్–2025 నిర్వహణకు నోడల్ కాలేజీగా భీమవరం డీఎన్నార్ కాలేజీ ఎంపికై ందని కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. సోమవారం కార్యక్రమ వాల్‌పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రెండు జిల్లాల నుంచి 18 నుంచి 25 ఏళ్లలోపు యువత పాల్గొనవచ్చన్నారు. నమోదు చేసుకున్న వారిలో 150 మందిని స్క్రీనింగ్ చేసి పోటీలు నిర్వహిస్తామని, ప్రతిభ కనబర్చిన 10 మందిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తామని చెప్పారు. ఈనెల 16వ తేదీ రాత్రి 11.59 నిమిషాల వరకు పేర్ల నమోదుకు అవకాశం ఉందన్నారు. మరిన్ని వివరాలకు సెల్ 8179179899, 9441388058 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. డీఎన్నార్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు ఎస్.అనిల్‌దేవ్, కె.సోమయ్య, ఈ.భరత్ రాజు, పీడీ ఆర్.సతీష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment