
పెద్దింట్లమ్మ జాతర ప్రారంభం
కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతర ప్రారంభమైంది. ఈ నెల 13 వరకు జాతర జరగనుండగా.. 10న జలదుర్గాగోకర్ణేశ్వరస్వామి కల్యాణం నిర్వహిస్తారు. 8లో u
ఓట్ల లెక్కింపునకు
పకడ్బందీ ఏర్పాట్లు
కలెక్టర్ వెట్రిసెల్వి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): గ్రాడ్యుయేట్ ఓట్ల లెక్కింపుపై పూర్తి అవగాహనతో లెక్కింపు చేయాలని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వెట్రిసెల్వి సిబ్బందిని ఆదేశించారు. స్థానిక సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపుపై సిబ్బందికి శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కౌంటింగ్ 3న ఉదయం 8 గంటల నుంచి సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రంలో ప్రారంభవుతుందన్నారు. ముందుగా బ్యాలెట్ బాక్సులకు ఉన్న సీళ్లను పరిశీలించాలన్నారు. ఓట్ల లెక్కింపునకు 28 టేబుల్స్ ఏర్పాటు చేశామని, 17 రౌండ్లలో లెక్కింపు చేస్తారన్నారు. లెక్కింపు డెమోను సిబ్బందికి స్వయంగా చేసి చూపించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment