
పెద్దింట్లమ్మా.. పాహిమాం
కై కలూరు: అమ్మా.. పెద్దింట్లమ్మా.. నీ చల్లని దీవెనలు అందించమ్మా అంటూ భక్తులు అమ్మను ఆర్తితో వేడుకున్నారు. కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతర ఆదివారానికి రెండో రోజుకు చేరింది. సెలవుదినం కావడంతో సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు జల్లు స్నానాలు ఆచరించారు. తలనీలాల సమర్పణ వద్ద రద్దీ కనిపించింది. అమ్మకు వేడి నైవేద్యాలను సమర్పించారు. ఉదయం జలదుర్గా సమేత పెద్దింటమ్మకు సుగంధ ద్రవ్యాభిషేకం, ధూప సేవ, బాలభోగం, పంచహారతులు అందించారు. పెద్దింట్లమ్మకు వస్త్ర, పుష్పాలంకరణ, ఉచిత ప్రసాదానికి భుజబలపట్నం గ్రామానికి చెందిన సయ్యపురాజు గుర్రాజు, బుద్దరాజు సుబ్రహ్మణ్యరాజు దాతలుగా వ్యహరించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మీగడ సత్యనారాయణ బృందం ప్రదర్శించిన మురళీ కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. ఆదివారం ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, ఇతర సేవల వల్ల రూ.1,35,735 నగదు వచ్చినట్లు తెలిపారు. జలదుర్గాగోకర్ణేశ్వరస్వామి కల్యాణం ఈ నెల 10న జరుగుతుందని తెలిపారు.

పెద్దింట్లమ్మా.. పాహిమాం
Comments
Please login to add a commentAdd a comment