
సాంకేతికతను రైతులకు అందించాలి
తాడేపల్లిగూడెం: కృషి విజ్ఞాన కేంద్రాల్లోని వ్యర్థాలను పునర్వియోగ సాంకేతికతను రైతుల దరికి చేర్చాలని ఉద్యానవర్సిటీ ఉపకులపతి డాక్టర్ కె.గోపాల్ కోరారు. వెంకట్రామన్నగూడెంలో మంగళవారం ఉద్యానవర్సిటీలో నిర్వహించిన శాసీ్త్రయ సాంకేతిక సలహామండలి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ రైతుల పొలాల్లో జీవనియంత్రణ కారకాలు లేకుండా ప్రోత్సహించాలన్నారు. సేంద్రియ వ్యవసాయంపై రైతులకు ఆసక్తి పెంచే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రైతులకు క్షేత్రస్ధాయిలో శాస్త్ర సాంకేతిక పరిజానం అందించే దిశగా పనిచేయాలన్నారు. 2024–25లో సాధించిన ప్రగతి, 2025–26 సంవత్సరంలో చేపట్టాల్సిన కార్యాచరణ గురించి చర్చించారు. కార్యక్రమంలో పరిశోధనాసంచాలకులు ఎమ్.మాధవి, గేదెల పరిశోధనాస్ధానం హెడ్ కె.ఆనందరావు, జిల్లా ఉద్యాన అధికారి దేవా ఆనందకుమార్, జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు జడ్.వెంకటేశ్వరరావు, జిల్లా అభివృద్ది అఽధికారి అనిల్‌కాంత్, డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ నరసయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment