
ప్రజా ఫిర్యాదులు తక్షణం పరిష్కరించాలి
భీమవరం: భీమవరం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 16 మంది నుంచి వినతులు స్వీకరించారు. బాధితుల సమస్యలను నిశితంగా తెలుసుకుని వాటిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి చట్టపరిధిలో పరిష్కారం అందిస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు. కుటుంబ తగాదాలు, సైబర్ మోసాలు, తల్లిదండ్రులు, అత్తారింటి వేధింపులు, ఆస్తి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ఆన్‌లైన్ మోసం వంటి సమస్యలపై ఫిర్యాదు చేయగా సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ఫిర్యాదు అంశాలను పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment