నరసాపురం రూరల్: చేతి వృత్తిదారులను కేంద్ర ప్రభుత్వం అన్నివిధాలా ప్రోత్సహిస్తుందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. శనివారం రుస్తుంబాద గ్రామంలోని అంతర్జాతీయ లేసు ట్రేడ్ సెంటర్ (ఐఎల్‌టీసీ)లో ఈపీసీహెచ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన హ్యాండీ క్రాఫ్ట్స్ ఎక్స్‌పోకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హస్త కళాకృతులకు దేశవ్యాప్తంగా మార్కెటింగ్ కల్పించేందుకు కేంద్రం కృషి చేస్తోందన్నారు. నరసాపురం ప్రాంత లేసు అల్లికలకు ప్రపంచ గుర్తింపు ఉందన్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, ఈపీసీహెచ్ ఎక్స్ చైర్మన్ ఆర్కే పస్సి, ఈడీ ఆర్కే వర్మ పాల్గొన్నారు.