
ఉపాధి పనుల ఆకస్మిక తనిఖీ
‘డైట్’లో పోస్టులకు దరఖాస్తులు
దూబచర్లలోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్)లో వివిధ విభాగాల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నట్టు ఏలూరు డీఈఓ తెలిపారు. 8లో u
నరసాపురం రూరల్: మొగల్తూరు మండలం వారతిప్ప మురుగు కాలువలో తూడు, కిక్కిస తొలగింపు పనులను గురువారం కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మస్తర్ రిజిస్టర్లను పరిశీలించి ఉపాధి హామీ పథకం పనులపై ఆరా తీశారు. కూలీలతో మాట్లాడారు. జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ పని కల్పిస్తామని కలెక్టర్ అన్నారు. పని ప్రదేశాల్లో తాగునీరు, మజ్జిగ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. డ్వామా పీడీ కేసీహెచ్ అప్పారావు, తహసీల్దార్ రాజ్‌కిషోర్, ఎంపీడీఓ చివటం త్రిశూలపాణి ఆమె వెంట ఉన్నారు.
లేసు పార్కుకు పూర్వ వైభవం
లేసు ఉత్పత్తులు, అలంకృతి లేసు పార్కుకు పూర్వ వైభవం తీసుకు వస్తామని కలెక్టర్ నాగరాణి అన్నారు. గురవారం నరసాపురం మండలం సీతారామంపురంలో లేసుపార్కును ఆ మె సందర్శించారు. కాలనుగుణంలో సరికొత్త డిజైన్లతో లేసు అల్లికలను రూపొందిస్తే మార్కెట్‌లో డిమాండ్ ఉంటుందన్నారు. ఈ ప్రాంత లేసులకు భౌగోళిక గుర్తింపు రావడం శుభపరి ణామమన్నారు. ఆర్డర్లు సాధించి ఎగుమతు లు పెంచేందుకు కృషి చేస్తామ న్నారు. ఆర్డీఓ దాసి రాజు, డీఆర్‌డీఏ పీడీ వేణుగోపాల్, లేసు పార్కు మేనేజర్ కుసుమకుమారి ఉన్నారు.