
కొల్లేరు కేసు 12 వారాలకు వాయిదా
ఈదురుగాలుల బీభత్సం
ఏజెన్సీ ప్రాంతంలో మంగళవారం రాత్రి ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. భారీ వృక్షాలు నేలకూలాయి. కొన్ని చోట్ల చెట్లు ఇళ్లపై పడ్డాయి. 8లో u
సీఈసీ సూచనల అమలుపై నివేదిక కోరిన ధర్మాసనం
కై కలూరు: కొల్లేరు అభయారణ్యంలో ఆక్రమణలు, పర్యావరణ విఘాతం అనే అంశాలపై సుప్రీంకోర్టులో ఉన్న కొల్లేరు కేసు 12 వారాలకు వాయిదా పడింది. ద్విసభ్య ధర్మాసనం ముందు కొల్లేరు అంశంపై బుధవారం వాదనలు జరిగాయి. క్షేత్రస్థాయిలో కొల్లేరు రైతుల సమస్యలపై ఏం సలహాలు ఇచ్చారని సీఈసీని సుప్రీం ప్రశ్నించింది.. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సీఈసీ సూచనలు ఎంత మేర అమలు చేసింది.. అమలు తీరును కలెక్టర్, ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఫారెస్టు, చీఫ్ సెక్రటరీ పరిశీలించి తమకు నివేదిక ఇవ్వాలని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. కాగా కొల్లేరు సమస్యపై అధ్యయనం చేసిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ(సీఈసీ) కొల్లేరులో 14,000 ఎకరాలు నష్టపోయిన జీరాయితీ రైతులకు నష్టపరిహారం అందించాలని, కొల్లేరులో సంప్రదాయ వేటకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినా అవేమీ జరగలేదు. మరోవైపు కూటమి నేతలు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి కొల్లేరు సమస్యను వివరించారు. రాష్ట్ర మంత్రి వై.సత్యకుమార్, కై కలూరు, ఉంగుటూరు ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, ధర్మరాజు, కొల్లేరు నాయకులు బలే ఏసురాజు, కొల్లి బాబీ, రాష్ట్ర చేపల రైతుల సంఘ అధ్యక్షుడు తాడినాడ బాబు తదితరులు కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ను కలిశారు. కేంద్రం నుంచి కూడా అఫిడవిట్ వేస్తామని కేంద్ర మంత్రి చెప్పినట్లు ఎమ్మెల్యే కామినేని తెలిపారు.