ప్రతి మున్సిపాలిటీకి ప్రత్యేకాధికారిని నియమించాలి
భువనగిరిటౌన్ : జిల్లాలోని ప్రతి మున్సిపాలిటీకి ఒక్కో ప్రత్యేక అధికారిని నియమించాలని కోరుతూ బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టర్ హనుమంతరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్ మాట్లాడుతూ ఆరు మున్సిపాలిటీలకు ఒక్కరే ప్రత్యేకాధికారిగా ఉండడం వల్ల పాలనకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉంటుందన్నారు. మున్సిపాలిటీల్లో అనేక ప్రజావసరాలు, సమస్యలు ఉంటాయని, అభివృద్ధి పనులను పర్యవేక్షించాల్సి ఉంటుందన్నారు. అన్ని మున్సిపాలిటీలకు ఒక్కరినే ప్రత్యేకాధికారిగా నియమించడం ఎక్కడ కూడా పూర్తిస్థాయిలో సమయం కేటాయించలేని పరిస్థితి ఉంటుందన్నారు. సమస్యలు సకాలంలో పరిష్కారం కావన్నారు. కాబట్టి అన్ని మున్సిపాలిటీలకు ఒక్కో ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మాయ దశరథ, జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేందర్‌గుప్తా, ఉట్కూరి అశోక్‌గౌడ్, జిల్లా నాయకులు వేముల అశోక్, ఏలే చంద్రశేఖర్, జైనపల్లి శ్యాంసుందర్‌రెడ్డి, పన్నల చంద్రశేఖర్, మంగు నర్సింహారావు, భువనగిరి పట్టణ అధ్యక్షుడు రత్నపురం బలరాం, మాజీ కౌన్సిలర్లు జనగాం కవిత, బొర్ర రాకేష్, ఉదయగిరి విజయ్, ఊదరి లక్ష్మి, నల్లమాస సుమ, జిల్లా అధికార ప్రతినిధి నీలం రమేష్, భువనగిరి మండల అధ్యక్షుడు సురేష్‌రెడ్డి పాల్గొన్నారు.
ఫ కలెక్టర్‌కు బీజేపీ నాయకుల వినతి
Comments
Please login to add a commentAdd a comment