పంటలకు సాగునీరివ్వడంలో ప్రభుత్వం విఫలం
భువనగిరి : సాగునీరు అందక జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని, ఇది ప్రభుత్వ వైఫల్యమేనని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. శనివారం భువనగిరి మండలంలోని వడపర్తి, హన్మాపురం, మన్నెవారిపంపు, బండసోమారం, చందుపట్ల, నాగిరెడ్డిపల్లి తదితర గ్రామాల్లో ఎండిన వరి పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. ప్రణాళిక లేకుండా బస్వాపురం రిజర్వాయర్ నుంచి నీటి విడుదల చేయటం వల్ల భూగర్భ జలాలు అడుగంటి బోర్లు పోయడం లేదన్నారు. మల్లన్నసాగర్ నుంచి నీటిని తరలిస్తూ బస్వాపురం నీటిని విడుదల చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. కేసీఆర్ పాలనలోనే రైతులు ఇబ్బంది లేకుండా ఉన్నారని, సమృద్ధిగా సాగునీరు అందిందన్నారు.పంటలకు నీరందించడంలో స్థానిక ఎమ్మెల్యే సైతం విఫలమయ్యారని మండిపడ్డారు. ఎండిపోయిన పంటలకు ఎకరానికి రూ.25వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పాడి రైతులకు బిల్లులు చెల్లించాలని కోరారు. వడపర్తిలో పొలం ఎండిపోయి కంటతడి పెట్టిన మహిళను పైళ్ల శేఖర్‌రెడ్డి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జనగాం పాండు, మాజీ జెడ్పీటీసీ బీరు మల్లయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ అంజనేయులు, నాయకులు ర్యాకల శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, పాండు, శ్రీనివాస్‌రెడ్డి, ప్రభాకర్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, బీఆర్‌ఎస్
జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment