నకిలీ మద్యం తయారీదారుల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

నకిలీ మద్యం తయారీదారుల అరెస్ట్‌

Published Mon, Apr 7 2025 11:19 AM | Last Updated on Mon, Apr 7 2025 11:19 AM

నకిలీ

నకిలీ మద్యం తయారీదారుల అరెస్ట్‌

నల్లగొండ: నకిలీ మద్యం తయారుచేస్తున్న ఏడుగురిపై కేసు నమోదు చేయడంతో పాటు ఐదుగురిని అరెస్ట్‌ చేసి, వారి నుంచి 600 లీటర్ల స్పిరిట్‌, మరో 660 లీటర్ల నకిలీ మద్యం స్వాధీనం చేసుకున్నట్లు నల్లగొండ ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆదివారం నల్ల గొండ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా చండూరు మండల కేంద్రానికి జానీపాషా గతంలో హైదరాబాద్‌లోని చైతన్యపురిలో మటన్‌ షాప్‌లో పనిచేసేవాడు. అతడికి రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌కు చెందిన శ్రీనివాస్‌తో పరిచయం ఏర్పడింది. అదే క్రమంలో 2016లో శ్రీనివాస్‌ బావమర్ది అయిన కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన శ్రీనివాస్‌గౌడ్‌తోనూ పరిచయం ఏర్పడింది. శ్రీనివాస్‌గౌడ్‌ కర్ణాటక నుంచి ముడిసరుకు తెచ్చి హైదరాబాద్‌ శివారులో నకిలీ మద్యం తయారు చేస్తుండటంతో 2019లో అతడిపై కేసులు నమోదయ్యాయి. ఆరు నెలల క్రితం శ్రీనివాస్‌గౌడ్‌ కర్ణాటక నుంచి హైదరాబాద్‌లో ఉంటున్న జానీపాషాకు ఫోన్‌ చేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్యం ఎక్కువగా అమ్ముడుపోతుందని, కావున ఏదైనా అనువైన ప్రదేశం చూపితే నకిలీ మద్యం తయారు చేస్తానని చెప్పాడు. దీంతో జానీపాష తనకు పరిచయస్తులైన నల్లగొండ జిల్లా చండూరుకు చెందిన ఎర్రజెల్ల రమేష్‌, దోమలపల్లి యాదగిరి అలియాస్‌ మంగళగిరికి విషయం చెప్పాడు. వీరు ముగ్గురు కలిసి నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం గానుగుపల్లిలో గల ఎర్రజెల్ల రమేష్‌కు చెందిన తోటలో నకిలీ మద్యం తయారుచేద్దామని నిర్ణయించుకున్నారు.

క్యాన్లలో నకిలీ మద్యం నింపి..

జానీపాషా, రమేష్‌, యాదగిరి కలిసి శ్రీనివాస్‌గౌడ్‌తో మాట్లాడి ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో నకిలీ మద్యం తయారుచేసేందుకు నిర్ణయించుకుని 5 డ్రమ్ముల స్పిరిట్‌ తెచ్చి తోటలో పెట్టారు. ముగ్గురు కలిసి రూ.6లక్షలు శ్రీనివాస్‌గౌడ్‌కు ఇచ్చారు. శ్రీనివాస్‌గౌడ్‌ చెప్పిన విధంగా ముగ్గురు కలిసి 40 బిస్లరీ క్యాన్లు తీసుకొచ్చారు. 2 స్పిరిట్‌ డ్రమ్ముల్లో శ్రీనివాస్‌గౌడ్‌ తెచ్చిన 3 రకాల ఫ్లేవర్స్‌ను కలిపి కల్తీ మద్యాన్ని తయారు చేశారు. ఈ నకిలీ మద్యాన్ని 40 బిస్లరీ క్యాన్లలో(ఒక్కోటి 20 లీటర్లు) నింపి 2, 3 రోజులు పులియబెట్టి తర్వాత ఒక్కో క్యాన్‌ రూ.10 వేలకు విక్రయించాలని శ్రీనివాస్‌గౌడ్‌ చెప్పాడు. అలా ఈ ముగ్గురు కలిసి మునుగోడులోని వైన్‌ షాపుల్లో పార్ట్‌నర్‌ అయిన జాజుల వెంకటేష్‌ను కలిసి మద్యం సరఫరా చేస్తామని చెప్పగా.. ప్యాకింగ్‌ సరిగ్గా లేదని అతడు తిరస్కరించారు. ఆ తర్వాత ఎర్రజెల్ల రమేష్‌ వారి అత్తగారి ఊరైన కనగల్‌ మండలం జి.ఎడవల్లిలో తనకు పరిచయమున్న బొమ్మరబోయిన భార్గవ్‌ను సంప్రదించగా అతడు రూ.10వేలు ఇచ్చి 20 లీటర్ల క్యాన్లు 4 తీసుకుని.. తనకు తెలిసిన బెల్ట్‌ షాపుల నిర్వాహకులను సంప్రదించగా వారు కూడా తీసుకునేందుకు నిరాకరించారు. జానీపాషా డ్రైవర్‌ సాయం ఉపేంద్రకు డబ్బులు ఇస్తామని చెప్పి.. నకిలీ మద్యాన్ని ఆటోలో తాము చెప్పిన ప్రాంతానికి చేరవేయాలని చెప్పారు. ఈవిధంగా కల్తీ మద్యం తయారు చేసి సరఫరా చేసే క్రమంలో పక్కా సమాచారం మేరకు వీరిని పట్టుకుని విచారించగా నేరం ఒప్పుకున్నట్లు ఎస్పీ వివరించారు. వీరిపై నాంపల్లి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసి ఎర్రజెల్ల రమేష్‌, మహ్మద్‌ జానీపాషా, సాయం ఉపేంద్ర, జాజుల వెంకటేష్‌, బొమ్మరబోయిన భార్గవ్‌ను అరెస్ట్‌ చేశామని, శ్రీనివాస్‌గౌడ్‌, దోమలపల్లి యాదగిరి అలియాస్‌ మంగళగిరి పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. అదేవిధంగా చండూరు మండలం దుబ్బగూడెం గ్రామంలో 20 క్యాన్ల నకిలీ మద్యం స్వాధీనం చేసుకుని చండూరు ఎకై ్సజ్‌ పోలీసులు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. దేవరకొండ ఏఎస్పీ మౌనిక, టాస్క్‌ఫోర్స్‌ సీఐ రమేష్‌బాబు, ఎస్‌ఐలు మహేందర్‌, శివప్రసాద్‌, నాంపల్లి సీఐ రాజు ఆధ్వర్యంలో నేరస్తులను పట్టుకున్న ఎస్‌ఐ శోభన్‌బాబు, నాంపల్లి పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది, ఎక్సైజ్‌ పోలీసులను ఎస్పీ అభినందించారు.

600 ÎrÆý‡Ï íܵÇsŒæ, 660 ÎrÆý‡Ï ˘

నకిలీ మద్యం స్వాధీనం

వివరాలు వెల్లడించిన నల్లగొండ

ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌

నకిలీ మద్యం తయారీదారుల అరెస్ట్‌1
1/1

నకిలీ మద్యం తయారీదారుల అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement