ఖరీదైన చెప్పులు, రెడీమెడ్ దుస్తులపై జీఎస్టీ మోత మోగించనుంది. రూ. 500 లోపు ఉన్న చెప్పులపై 5శాతం పన్ను విధించాలని, రూ. 500లు దాటితే ఏకంగా 18శాతం పన్ను విధించాలని జీఎస్టీ మండలి తాజాగా నిర్ణయించింది. అలాగే రెడీమెడ్ దుస్తులపై జీఎస్టీ మోత మోగనుంది. నూలు, మిల్లు వస్త్రాలపై 5శాతం పన్ను విధించనుండగా, రెడీమెడ్ దుస్తులపై 12శాతం పన్ను విధించాలని నిర్ణయించారు.