జనంపై జీఎస్టీ మోత మొదలైంది.. శనివారం నుంచి అమల్లోకి వచ్చిన వస్తుసేవల పన్ను మార్కెట్లో వస్తువుల ధరలపై ప్రభావం చూపింది. అత్యధిక శాతం పన్ను శ్లాబ్‌లలో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు, కాస్మెటిక్స్, ఫోన్ల ధరలు, వినోద రంగానికి చెందిన సేవల చార్జీలు భారీగా పెరిగాయి.