ఉత్తర కొరియా తన దుస్సాహసాన్ని కొనసాగిస్తునే ఉంది. అమెరికా తమపైకి దాడి చేసినా ఏం చేయలేదనే తీరుగా వ్యవహరిస్తోంది. ఒక్క ఈ నెలలోనే రెండుసార్లు ఖండాంతర అణుక్షిపణులను పరీక్షించింది. ఈ నెల(జులై) 4న ఓ ఖండాంతర బాలిస్టిక్ అణుక్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా తాజాగా శుక్రవారం మరో బాలిస్టిక్ ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది.