అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని కించపరిచేలా వ్యహరిస్తున్నారని శాసనసభా పక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే వెంకటరమణ సంతాప తీర్మానం సందర్భంగా ప్రతిపక్ష నేతగా సంతాపం తెలిపే హక్కులేదా అని ఆయన ప్రశ్నించారు. సభా సంప్రదాయాలను స్పీకర్ పాటించాలని వైఎస్ జగన్ అన్నారు. ఎమ్మెల్యే వెంకటరమణ మృతి బాధాకరమన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వెంకటరమణ తొలిసారి ఎమ్మెల్యే అయ్యారని ఈ సందర్భంగా వైఎస్ జగన్ గుర్తు చేశారు. తమ తరపు నుంచి వెంకటరమణ కుటుంబానికి సహాయ సహకారాలు ఉంటాయని వైఎస్ జగన్ తెలిపారు.